కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా నారాయణపురం లో వెంకటమ్మ, కారంచేటి తిరుమల మనోహరాచార్య దంపతులకు 22 జనవరి 1929 రోజున కె వి రాఘవాచార్య జన్మించారు.చిన్నప్పుడు కె వి రాఘవాచార్యులు తండ్రి నీడలోనే చదువుకోవడం వలన, చదువు అంటే ఇదే అని తెలియని రోజుల నుండే వారి విద్యా వ్యాసంగం ప్రారంభమైంది. చిన్నప్పటి నుండే స్తోత్రాలు పద్యాలు ఎక్కాలు పట్టించేవారు. తాను 5 వ సంవత్సరం నుంచి ఉత్తరాలను చదవటం నేర్చుకున్నాడు. ఆంధ్రనామ సంగ్రహం, సాంబ నిఘంటువు, అమరకోశం వంటివి ఉదయం చెప్తే మరుసటి రోజు నోటికి చెప్పేవాడు. 

   

శ్రీ కె.వి రాఘవాచార్యులు ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టి  కళాశాల అధ్యాపకుడి వరకు ఎదిగారు. అలాఎదిగిన శ్రీ కె. వి. రాఘవాచార్యులు గారు ఎన్నో బిరుదులు సన్మానాలు అందుకున్నారు.

శ్రీ కె.వి రాఘవాచార్యులు గారి గురించిన మరింత సమాచారం కోసం దిగువన అందించిన లింకు పై క్లిక్ చేయండి

https://kvraghavacharyasspeetam.blogspot.com/p/about-k-v-raghavacharya-gaaru.html