రచనలు పంపవలసిన లింకు ఇక్కడ క్లిక్ చేయండి లేదా మీ రచనలను kvraghavacharyasspeetam@gmail.com
మెయిల్ ద్వారా టెక్స్ట్ రూపంలో గాని,వర్డ్ ఫైల్ లో గాని పంపగలరు.
1.రచయితలు ప్రభుత్వ డిగ్రీ &పిజి కళాశాల(స్వయంప్రతిపత్తి),సిద్దిపేటకు చెందిన పూర్వ,ప్రస్తుత విద్యార్థులు లేదా సిబ్బందిగా పని చేసిన,చేస్తున్న వారై ఉండాలి.
2.రచనలు రాజకీయ,కుల,మత వర్గ ధోరణులకు,వ్యాపార కలాపాలకు దూరంగా ఉండాలి.
3.అంతర్జాల సాంకేతికతను ఉపయోగించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళాశాల పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు అవకాశం.
4.గతంలో ప్రచురించిన లేదా వేరే పత్రికలల్లో ప్రచురితమైనా లేదా ప్రస్తుతం ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు స్వీకరించబడవు.
5.వ్యక్తిగత బ్లాగ్ లలో,వెబ్ పత్రికలలో ప్రచురించినా లేదా ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు స్వీకరించబడవు.
6.తెలుగు భాషలో గల ఏదేని ఒక ప్రక్రియను ఎంచుకొని రచన చేయవచ్చు.
7.రచయితలు తమ రచనలను తెలుగులో టైపు చేసి వర్డ్ ఫైల్ ను మరియు పిడిఎఫ్ ఫైల్ ను జత చేసి పంపగలరు.చేతి రాత ద్వారా గానీ లేదా రచనను ఫోటోతీసి పంపినవి స్వీకరించబడదు.
8.కెవి రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠానికి మరియు రచయితకి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీల ప్రస్తావన ఉండదు.
9.కెవి రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం బ్లాగ్ లో ప్రచురించిన రచనలు రచయితల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.దీనికి కెవి రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం ఎలాంటి బాధ్యత వహించదు.
10.రచయితలు పంపిన రచనలను ప్రచురించడానికి,మార్పులను సూచించడానికి సర్వహక్కులు ఎడిటోరియల్ బోర్డు కి కలవు.
11.పైన తెలిపిన సూచనలు అంగీకారయోగ్యంగా లేని యెడల రచనలను తిరస్కరించడానికి సర్వహక్కులు ఎడిటోరియల్ బోర్డు కి కలవు.
1 Comments
తెలుగు విభాగం వారికి శుభాకాంక్షలు మరియు
ReplyDeleteఅంతర్జాల మాద్యమంగా తెలుగు సాహిత్య ప్రియులకు మీరు చేస్తున్న కృషికి అభినందనలు