వందవందనం అభివందనం
మాతృభాషకి వందనం
పాల మీగడ, మింటి పండు వెన్నెల వంటి
మాతృభాషకి వందనం
నారికేలజలము, తల్లిపాలబలము
మధుర రసాలము, నవరసాలతలము
మాతృభాషకి వందనము
పోత పాల వంటి పర భాషలెన్నున్న
తల్లి పాలవోలె ఉల్లముల వికసించు
మధురమధురంబైన
మాతృభాషే మిన్న
మాతృ భాషలో బోధ
వికసించును విద్యార్థి మేధ
తెలిసి మసలుకో
తెలుగు నిలుపుకో
తెగువ నింపుకో
తెలివి పెంచుకో
మన తెలుగుభాష మాధుర్యాన్ని తెలుసుకుందాం...
మానసిక వికాసానికి దోహదం చేసే మాతృభాషను కాపాడుకుందాం...
-డా.పన్యాల అయోధ్యారెడ్డి,
సహాయాచార్యులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల - సిద్ధిపేట.
2 Comments
డా.పి. అయోధ్యరెడ్డి గారి కవితలోని మాతృ భాష పైన ఉన్న మక్కువ తేనె వంటి తియ్యదనాన్ని కురిపిస్తుంది. మాతృత్వం లోని మాతృభాషకు మా వందనం.
ReplyDeleteధన్యవాదాలు sir
Chala bagundi sir
ReplyDelete