ఒక గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండే వాడు.
ఇతడు చాలా ఆస్థిపరుడు అతనికి ఎటువంటి లోటు లేదు. రంగయ్య తన జీవితాన్ని ఎంతో సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో గడిపినా తరగని ఆస్తీ ఉంది. కానీ రంగయ్యకు ఆస్థిపై వ్యామోహం తగ్గలేదు. ఎందుకంటే రంగయ్యకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడి కోసం తనకున్న ఆస్థులే కాకుండా ఇంకా ఎక్కువ ఆస్థులను కూడబెట్టి అధిక ధనికుడని కావాలనే కోరిక కలిగింది. అందుకోసం రంగయ్య అధిక ధనవంతుడు అగుటకు ఎన్నో అడ్డదారులు తొక్కడం, లంచం, దొంగతనాలు,ఇతరుల ఆస్థులకు దోచుకోవడం... వంటి తప్పుడు మార్గాల ద్వారా అధిక ధనం కూడబెట్టడం చేస్తుండేవాడు.
'ఇతరుల నుండి దోచుకున్న సొమ్ము ఎన్నటికీ నిలవబోదంటారు పెద్దలు...'అని చుట్టుపక్కల వాళ్ళు రంగయ్య గురించి అనుకుంటూ ఉంటారు.
రంగయ్య ఇతరుల నుండి దోచుకున్న ధనం, తరువాత కొన్ని రోజులు గడిచిన పిదప తన కుమారుడికి పెద్ద వ్యాధి సోకి అనారోగ్యానికి గురవుతాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మెరుగైన వైద్యం జరిపించి తన కుమారుడిని ఆ వ్యాధి నుండి దక్కించుకుంటాడు.
రంగయ్య తన చెడు మార్గాల ద్వారా కూడబెట్టిన డబ్బునే గాక అదనంగా అప్పు చేస్తాడు.
తరువాత కొన్ని రోజులకి రంగయ్య తన కుమారుడికి పెళ్ళి చేస్తాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు రోడ్డు ప్రమాదం జరిగి రంగయ్య కొడుకు చనిపోతాడు.
"అప్పుడు రంగయ్యకు ఏమీ మిగిలింది శేషం తప్ప"అని ఇతరులు అంటుండగా విని రంగయ్య ఆలోచనలోపడతాడు
ఇక కుమారుడు లేడు, చెడు మార్గాల ద్వారా సంపాదించిన ధనం లేదు.తాను సంపాదించినది కూడా ఇతరులకు సహాయం చేస్తూ తన శేష జీవితాన్ని గడుపుతాడు.
******
కాబట్టి మనిషి తన జీవితంలో తన కష్టార్జితం వల్ల పొందిన ఆస్థులను మాత్రమే అనుభవించాలి తప్ప ఇతరుల సొమ్ము కై ఆశించకూడదు.
ఆశపడడం తప్పు లేదు......
అత్యాశపడడం తప్పు అని అర్థం.....
చూశారా! ఇతరులకు పాపం చేయాలని చూస్తే ఆ పాపం మన పై ప్రభావం చూపిస్తుందని ఈ కథ యొక్క సారాంశం.
🙏కృతజ్ఞతలు 🙏
------------------------------------------------------------------
-బి.నవీన్ కుమార్,ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,
0 Comments