రామస్వామి అనే వ్యక్తి ఒక నిరుపేద కుటుంబంలో జన్మిస్తాడు. తండ్రి అతనికి 5 సం,,ల.. వయసులోనే చనిపోయాడు.
రామస్వామి పెరిగి పెద్దవాడై తన తల్లి అయిన యశోదమ్మను కుటుంబ భారాన్ని చూసుకునేవాడు.
అతను ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ తన తల్లిని మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకునేవాడు.తన కంటికిరెప్పల తన తల్లిని కాపాడుకునేవాడు అయితే ఒక రోజు యశోదమ్మ అనారోగ్యానికి గురవుతుంది.
హాస్పిటల్ కి తీసుకుపోదామంటే ఈ మాయదారి కరోనా మృత్యువలయన్ని సృష్టిస్తుంది. రామస్వామికి ఏం చేయాలో అర్థంకాక తన మిత్రుడైనటువంటి నీలకంఠంకు ఫోన్ చేసి తల్లి అనారోగ్య పరిస్థితి గురించి వివరించాడు.
నీలకంఠం మంచి తెలివతేటలు గల అబ్బాయి, ఇతరులకు సహాయం చేయడంలో మంచి మనసున్న వ్యక్తి , ఇతను హైదరాబాద్ లో ఉద్యోగం చేసేవాడు. రామస్వామి తన తల్లి గురించి చెప్పగానే తన ఉద్యోగం పక్కనపెట్టి ఊరికి వచ్చాడు. రామస్వామికి ధైర్యం చెప్పి యశోదమ్మని మంచి హాస్పిటల్లో చేర్పిస్తాడు నీలకంఠం.
రామస్వామి తల్లి గురించి దిగులుపడెవాడు, అమ్మకి ఏమీ కాదు నువ్వేం భయపడకు అంతా మంచే జరుగుతుంది అని నీలకంఠం ధైర్యాన్ని ఇస్తాడు.
ఎదుటి వ్యక్తికి బాధలు సంభవించినప్పుడు వారికి మనోధైర్యం చెప్పడం వలన వారి బాధ సగం దూరమవుతుందన్న విషయం నీలకంఠానికి తెలుసు...
యశోదమ్మకి అనారోగ్యం పూర్తిగా తగ్గిపోతుంది.ఇంటికి వచ్చారు.2,3 రోజుల తరువాత రామస్వామికి జ్వరం, జలుబు చేసింది. దానితో అతనికి అనుమానం కరోనా వచ్చిందని ఇది గమనించిన నీలకంఠం తనతో పాటు రామస్వామిని, యశోదమ్మనీ కరోనా పరీక్షలు చేయించడానికి హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. పరీక్షలు చేసిన తరువాత రామస్వామికి మాత్రమే కరోనా నిర్ధారణ అవుతుంది.దానితో రామస్వామి మరియు అతని తల్లి భయపడతారు.అమ్మ రామస్వామికి ఏం కాదు నువ్వేం దిగులుచెందకు అని నీలకంఠం ధైర్యం చెప్తాడు. రామస్వామి, నీలకంఠంతో నీవు మాకోసం నీ పనులు వదులుకున్నావు ఇక నీవు వెళ్ళు అని చెప్తాడు.
సుఖాలలో ఉన్నపుడు తోడుగా ఉండడం కాదు ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు తోడుండి మనోధైర్యం చెప్పడమే మనిషికి ఉండవలసిన లక్షణం అని నీలకంఠం,రామస్వామికి చెప్తాడు.
నాకు కరోనా వచ్చింది, ఏమవుతుందో నాకు ఏదన్నా అయితే నా తల్లి కూడా బ్రతకదని ధైర్యాన్ని కోల్పోయి కుమిలి కుమిలి ఏడుస్తాడు రామస్వామి. నీకు ఏమికాదు నీవు ధైర్యంగా ఉండు నేను చెప్పినట్లు చేయు తొందరగా కొలుకుంటావు అని నీలకంఠం మనోధైర్యాన్ని ఇస్తాడు. రామస్వామి నీవు రోజు డాక్టర్లు మరియు ప్రభుత్వం అందజేసిన మందులు తప్పనిసరిగా వాడుతూ ఆవిరి, మిరియాల కషాయం, వెచ్చని నీటిని తాగు అంతేకాకుండా కొద్దిసేపు సూర్యుని కిరణాలు పడేలా ఎండలో నిలబడు నయం అవుతుందనీ పరిష్కార మార్గాలు చెప్పాడు నీలకంఠం.స్నేహితుడు చెప్పినట్లు ప్రతిరోజూ పాటించాడు.కొన్ని రోజుల తరువాత కరోనా నుండి కొలుకుంటాడు.
రామస్వామి, నీలకంఠానికి ఫోన్ చేసి నేను వాడిన మందులు, మంచి పదార్థాలు నాకు నయం చేసాయో, లేదో తెలియదు కానీ నీవు నాకిచ్చిన మనోధైర్యమే నన్ను బ్రతికించింది అని ఆనందం వ్యక్తం చేస్తాడు.
******
'మనోధైర్యమే మహాబలం' కరోనా వచ్చిన వ్యక్తికే కాదు ఇతర వ్యాధులకు గురి అయిన వారిలో సాటి మనిషిగా మనోధైర్యం నింపడం వలన వారు తొందరగా కొలుకునే అవకాశం ఉంది.
ప్రతి రోగికి మనోధైర్యం అనేది ఒక బలంగా మరియు మందుగా కూడా పనిచేయవచ్చని సందేశమే ఈ కథ.
🙏కృతజ్ఞతలు 🙏
-------------------------------------------------------------
-బి.నవీన్ కుమార్,ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,
0 Comments