పెట్టిన మొక్కను పెంచు 
పెంచిన మొక్క చెట్టుగా వచ్చు
పెరిగిన చెట్టు నీడను ఇచ్చు 
నీడనిచ్చే చెట్టుకు ఆకులు వచ్చు 
వచ్చిన ఆకులకు పూగాయలు కాచు 
కాచిన చెట్టు మందులు ఇచ్చు 
ఇచ్చిన మందులు మనల్ని మార్చు 
మారిన మనిషి బ్రతుకును చూచు 
బ్రతికిన నరుడు ఇంటికి వెలుగు 
వెలుగెప్పుడూ వెలగాలంటే 
ఆ చెట్టును బ్రతికించూ...  
కె.సౌజన్య,
బిఎస్సి,ఎం.పి.సి.ఎస్,
ద్వితీయ సంవత్సరం.