చంధం అనే చంధస్సుతో  
అందం అనే అలంకారాన్ని  
గణాలనే గుణాలని కలిపి 
వేస్తున్నాను నీ మెడలో ఉత్పలమాల అనే మాలను
చంపకమాలతో చేతులెత్తి  నమస్కరిస్తూ 
తేనెలొలికించే తేటగీతితో 
అలరారించే ఆటవెలదితో 
సీసం అనే మోసం లేని స్నేహాన్ని అందించిన 
కందం లాంటి కాలంతో బంధంలా ఉన్న మనల్ని 
బంధువులా విడదీస్తుంది 
హల్లులా ఉన్న మాలో అచ్చులా కలిసి పోయిన మీరు 
సంధిలా విడిపోతున్నా సదా మనమందరం 
ఒక సమాసంలా కలిసి ఉండాలని 
భ ర న భ భ ర వతో భగవంతున్ని ప్రార్ధిస్తూ 
                                         శార్ధూలంతో సెలవు........ 


                                                                  
   బి . చందు
ఎం.ఎ తెలుగు 
ప్రథమ సంవత్సరం