అందమైన ఆకృతి పచ్చని ప్రకృతితో గల అందం 
అది చూసిన కన్నులకి అంతులేని ఆనందం 

అంతా మనం అని అనుకునే జనం 
ఇక్కడుండే ప్రతీ హృదయం పరమ పావనం 

నూతన కార్యాలకు శ్రీకారం 
సాగించే సహజీవనంలో సహకారం 
ఒకరిపై ఒకరికి మమకారం 

అందమైన మనసులతో కల్మషం లేని అమాయకత్వం 
నీతి నిజాయితీలతో కూడిన నిజమైన నాయకత్వం 

విద్యార్థుల్లోని అంతులేని వికాసం 
అన్నీ అవకాశాలు వారికే కైవసం 

ఆనందాలు వెల్లివిరిసే అందమైన పూదోట 
అదే మా ఊరు నారాయణరావుపేట 

బి.నమ్రత,
ద్వితీయ సంవత్సరం, 
బి.ఎస్సి. ఎంపిసిఎస్.