వీర వనితవై కదలవే 
నీ తెగువ అనే బాణాన్ని సంధించవే ||2||

ఇన్నాళ్ళు అనుకువగా ఉన్న మనం 
ఇప్పుడు అపరకాళిలా మారాల్సిన తరుణం 
ధ్వజమెత్తీ రగలవేమి... 
      ధ్వజమెత్తీ రగలవేమి నిప్పు కనికవై 
నీ ధన,మాన,ప్రాణాల పరిరక్షణకై 
మాతృమూర్తివైన నీ గౌరవానికై 
వీర వనితవై కదలవే 
నీ తెగువ అనే బాణాన్ని సంధించవే 
                  ఓ... ఓ... 
 ఛ|| :-
 పురిటి నుండే పుట్టెడు కష్టాలను నువ్వోర్చుకుంటు
అన్నిటిని తట్టుకుంటు అధిగమిస్తివి 
ఆడపిల్లవైనందుకు అడుగడుగునా అవమానాలెదురైన
తట్టుకుంటు ముందుకెల్తివి 
                 ఓ... ఓ... 
సృష్టికి జీవం పోసిన మాతృమూర్తివి 
నీ ఉనికే ప్రశ్నగా మారే ఈ స్థితి ఏమిటి 
           అఖిల జగతి పూజించే ఆది శక్తివి 
నీ ఆత్మగౌరవం అణిగే ఈ దుస్థితేమిటి 
            ఎలుగెత్తి చాటావేమి.... 
ఎలుగెత్తి చాటు నీ శక్తి యుక్తివి 
            నీ సామర్థ్యం సకల సృష్టినే చూడని 
ఈ లోకమంత నీ ఖ్యాతిని కీర్తించని.... 
 ఛ|| :-
అడుగడుగున బాధలను వేధింపులననుభవిస్తూ 
           ఇంకెంత కాలమనీ కుమిలిపోతావు 
అబలవని ఉండకు నువు సబలవని తెలుసుకో 
            చరితలోన నీ శౌర్యం గుర్తుచేసుకో 
                 ఓ... ఓ... 
అసుర జాతి అహం అణచిన అఖండ శక్తివి 
నీకు ఆత్మ రక్షణే కరువవ్వటమేమిటి 
శత్రువులను తరిమేసిన ఝాన్సీ రాణివి 
నీపై అరాచాకాలకీ నువ్వు బలవ్వటమేమిటి
   గద్దించి కదులు నువ్వు.... 
గద్దించి కదులు నువ్వు కదన ఖడ్గమై 
   పైశాచిక అసురత్వం ఖండించవే  
మగువ అస్తిత్వం పరిష్టంగా కాపాడవే 
  వీర వనితపై కదలవే.... 
నీ తెగువ అనే బాణాన్ని సంధించవే....    
బి.నమ్రత,
ద్వితీయ సంవత్సరం, 
బి.ఎస్సి. ఎంపిసిఎస్.