...గోనసంచి..
ఒక బస్ స్టాప్ లో....కుర్చీ లో.....
మాసిపోయిన దోతి కట్టుకొని..,చిల్లులు పడ్డ చొక్కా వేసుకొని...,తెల్లగా నెరిసి పోయిన జుట్టుతో..., డొక్క లోపలికి పోయి.., ఎముకలు కనబడేలా...,బక్కచిక్కి పోయిన ఒక ముసలివాడు.
తన కుడి చేతిన కర్ర పట్టుకుని..,ఎడమ చేతి చంక లో..,ఒక బట్టల ముళ్లే పెట్టుకొని...
తన కొడుకుని , మనుమడినీ చూడడానికి.....
పట్నం వెళ్ళడానికి.. బస్సు కోసం ఎదురుచూస్తూ.. ఉన్నాడు.
ఎదురుచూస్తున్న సమయం లో...పట్నం వెళ్లే బస్సు రానే.. వచ్చింది.
ఆ ముసలివాడు మెల్లిగా నడుచుకుంటూ... వెళ్లి పట్నం వెళ్లే బస్సు ఎక్కాడు.
ఇంతలో ..ఆ బస్సు పట్నం చేరుకుంది.
తన కొడుకు ఇచ్చిన చిరునామతో..ఎలాగో..అలా.. మెల్లిగా తన కొడుకు ఇంటి కి చేరుకున్నాడు.
ఇంట్లోకి వచ్చిన ఆ తండ్రి నీ చూసి..తన కొడుకు
ఆ...నాన్నా ఎలా ఉన్నావు..బాగున్నావా...అని అడిగాడు.
అలా..ఆ మాట అనగానే .ఆ తండ్రి గుండె సంతోషంతో..పులకరించిపోయింది .తన పెదవుల పై చిరునవ్వు వచ్చి.. కళ్లల్లో ఆనందభాష్పాలు నిండిపోయాయి.
మెల్లగా కొడుకు దగ్గరికి..నడుచుకుంటూ వచ్చి.. కన్నీరు కారుస్తూ..తన చేతులతో కొడుకు మొహం నిమురుతూ..
నేను బాగానే ఉన్నాను నాయన..నువ్వు ఎలా.. ఉన్నావు రా...అని అడిగాను.
దానికి సమాధానంగా తన కొడుకు..
ఆ. బాగానే ఉన్నాము..మాకేమైందనీ..,అన్నాడు వెటకారంగా..
సరి సరే..కానీ మళ్లీ ఎప్పుడు ఊరు వెళ్తావు అని అడిగాడు.
అలా అడగగానే..ఆ.. తండ్రి..
మిమ్మల్ని చూడాలనిపించింది రా..అందుకే వచ్చాను. ఒక వారం రోజులు ఉండి వెళ్తాను. అని అన్నాడు.
అపుడు ఆ కొడుకు సరే..నాకు బయట పని ఉంది. వెళ్తాను.అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ ముసలాయన తన మనుమడిని దగ్గరికి తీసుకొని ముద్దాడాడు. కోడలిని ఏమ్మా..బాగున్నావా అని అడిగాడు.
సమాధానంగా ఆయన కోడలు కూడా వేటకారంతో..., కోపంతో...
ఆ.. ఇప్పటికైతే బాగానే ఉన్నాము..ఇప్పుడు నువ్వు వచ్చావుగా.. ఇంకేం బావుంటాం అని అంది.
కానీ...,
ఆ ముసలాయన కొడుకుని , మనుమడిని చూసిన ఆనందం లో అవేమి పట్టించుకోలేదు.
తన మనుమడితో ఆడుతూ.. పాడుతూ..,సంతోషంగా రోజులు గడుపుతున్నాడు.
ఇలా రోజులు గడుస్తూ.. ఉండగా...,
ఒక రోజు బోరున వర్షం , ఉరుములు , మెరుపులు, తీవ్రమైన గాలితోవాన పడుతుంది.
ఆ ముసలాయన ఆ వానకి,గాలికి, తట్టుకోలేక శరీరం వణుకుతూ.., తీవ్రమైన జ్వరం, దగ్గు అందుకుంది.
ఈ విషయం చెప్పాలి అని ఆ ముసలాయన తన కొడుకు దగ్గరికి వెళ్లాడు.
తన కొడుకు దగ్గరికి వెళ్లి.....
ఓరేయ్ నాయనా..నాకు శరీరం మొత్తం వణికేస్తోందిరా,తీవ్రమైన జ్వరం వచ్చినట్టు ఉందిరా... వైద్యున్ని పిలిపించి ఏ మాత్రో.., సూదో..,ఎయించరా..అని అన్నాడు.
అది విన్న కొడుకు వెటకారంగా....,
నువ్వు రావడమే ఎక్కువ అంటే మా ప్రాణాలకు ఇదోట..అని కటినంగా మాట్లాడాడు. వెంటనే,
తన భార్య కూడ ఆ ముసలోడి కి ఎం రోగమో.., ఎమో.. ఇపుడు ఏది నమ్మడానికి లేదండి.తరువాత మనకి ఆ రోగం రుద్దిపోతే ..ఎలాఅండి.. వెంటనే అతన్ని ఇక్కడి నుండి వెళ్ళమనండి అని కోపంతో అంది.
అపుడు ఆయన తన తండ్రి తో.....
సరే.నేను వైద్యున్ని పిలుస్తాను. ఏ సూదో..., మాత్రో.., ఎయిస్తాను. కానీ,నువ్వు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లిపో..నాన్నా.అని అన్నాడు.
ఆ మాటలు విన్న ముసలాయన గుండె ఒక్కసారిగా...చలించిపోయి,గుండెల్లో చెరువంత బాధ నిండిపోయింది.
అపుడు ఆ ముసలాయన తన కొడుకుతో.....,
అలాగే నాయన మీరన్నట్లుగానే వెళ్తాను కానీ,ఇప్పుడు ఎలా వెళ్లాలి రా,రాత్రి కావొస్తోంది..బోరున వర్షం పడుతుంది . రేపు ప్రొద్దున్నే లేచి వెళ్తాను .అని అన్నాడు.
కానీ,
తన కొడుకు ఎంత చెప్పిన ,ఎంత బ్రతిమాలినా వినలేదు.
ఆ ముసలాయన కొడుకు. తనతో....,
నువ్వు వాన పడుతుంది అంటున్నావు కదా నాన్నా... ఇదిగో ఈ గొనసంచి ఇస్తాను. కప్పుకొని వెళ్లు .అని ఇంటి నుండి వెళ్లగొట్టాడు.
ఆ తండ్రి గుండె నిండా .. బాధ ను నింపుకొని.. కన్నీరు కారుస్తూ...వెళ్ళిపోయాడు .
ఇదంతా చూస్తున్నా ఆ ముసలాయన మనుమడు....
తన తాత ను తీసుకురావడానికి వాన లో వెతుక్కుంటూ.. వెళ్లాడు.
చివరికి ఆ మనుమడు తాత ను వెతికి ఇంటికి తీసుకొచ్చాడు .ఆ తాత కప్పుకున్న గొనసంచిని తీసి సగం కత్తిరిస్తున్నాడు.
ఇది చూసిన ఆ అబ్బాయి అమ్మ,నాన్నా ..
ఎందుకురా ఈయనని మళ్లీ తీసుకొచ్చావు . అయినా..,ఆ గోనసంచిని ఎందుకు సగం చేస్తున్నావురా అని కొప్పడుతూ అడిగారు.
వాళ్లకి సమాధానంగా ఆ ముసలాయన మనుమడు..,
ఆగండి నాన్నా.ఒక్క నిమిషం చెప్తాను.అని ఆ గోనసంచిని సగం చేసి, ఇదిగో నాన్నా విను....,,
ఇప్పుడు మీరు తాత ని వెళ్లగొట్టారు కదా....
తరువాత నేను పెద్దయ్యాక మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు కూడా ఈ గోనసంచి ఇచ్చి మిమ్మల్ని ఇలాగే వెళ్లగొట్టాలి కదా.నాన్నా ...అని చెప్పాడు.
అది విన్న ఆ తల్లిదండ్రుల గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది.
ఆ తల్లిదండ్రులు తమ తప్పుని తెలుసుకొని , పశ్చా త్తాపంతో తన తండ్రి కాళ్ళ మీద పడి,నాన్నాగారు నన్ను క్షమించండి . నేను తప్పు చేశాను .అని..,
నన్ను కూడ క్షమించండి మామయ్య గారు. మీరు కూడ మా నాన్న గారి వంటివారేన ని నేను మరిచాను .అని ఆ ముసలాయన కాళ్ళ మీద పడి ఇద్దరూ వేడుకున్నారు....
ఇది కథ కాదు - వాస్తవం
చూసారా ....
మనల్ని కని, పెంచి,పెద్ద చేసిన మన తల్లిదండ్రుల నే....,మనం గౌరవించకపోతే....
మనకు పుట్టిన పిల్లలు ....
మనల్ని ఎలా గౌరవిస్తారు.....
చెప్పండి...
పి. సాయి ప్రియ
ఎమ్. ఏ.తెలుగు ద్వితీయ సంవత్సరం
ప్రభుత్వ డిగ్రీ&పిజి కళాశాల, సిద్దిపేట.
0 Comments