అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు . అతను బీదవాడు అతడి తండ్రి వృధ్యాప్యంలో ఉన్నాడు. అతడి చివరి కోరికగా రాజయ్యను పెళ్ళి చేసుకోమని కోరాడు . తండ్రి కోరిక మేరకు రాజయ్య పెళ్ళి చేసుకున్నాడు . కొన్ని రోజులకు రాజయ్య తండ్రీ మరణించాడు . ఒక సంవత్సరానికి రాజయ్యకు కుమారుడు జన్మిస్తాడు . అతడి పేరు రాము .....,రాము తన పదోవయేటనే తల్లి మరణించింది...దానితో రాజయ్య మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కొడుకు పుట్టాడు అప్పుడు ఆమె రాముని చదువు మాన్పించి రాముని పశువులను మేపడానికి పంపించేది .రాముకి అతడి తమ్ముడు ప్రేమ్ అంటే చాలా ఇష్టం... ప్రేమ్ కి రాము అంటే కూడా చాలా ఇష్టం.
కానీ........
రాము పిన్ని రాముతో ప్రేమ్ నీ మాట్లాడవద్దని చెప్పేది . కానీ ప్రేమ్ వినేవాడు కాదు రాము పశువులను మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిన్ని రాముకి సల్ది అన్నం సద్దిలో పెట్టేది . అది మధ్యాహ్నం వరకు పాసిపోయేది దానితో రాము రోజు మధ్యాహ్నం పస్తులు ఉండేవాడు .
ఒక రోజు రాము వాళ్ళ పిన్ని తన పుట్టింటికి వెళదామని రాజయ్యను అడుగుతుంది దానికి రాజయ్య ఒప్పుకుంటాడు.రాముని కూడా సిద్దం అవ్వమని చెప్తాడు. కానీ ......దానికి రాము వాళ్ళ పిన్ని ఒప్పుకోదు.... రాజయ్యతో గొడువపడుతుంది ఇది విన్న ప్రేమ్ కూడా రాను అని మారం చేస్తాడు ..కానీ.....ఆమె ప్రేమ్ ని కొట్టి.బెదిరించి తీసుకొని వెళ్తుంది .
వాళ్లు వెళ్తుంటే దారిలో చీకటి పడుతుంది దానితో రాత్రి అక్కడే బసచెయ్యటానికి ఏర్పాట్లు చేసుకుంటారు,నిద్రపోతారు. తెల్లవారు జామున లేచి చూసేసరికి ప్రేమ్ కనిపించలేదు దానితో రాజయ్య , తన భార్య వెతకటం మొదలు పెట్టారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది తిరిగి ఇంటికి వచ్చారు.
రాజయ్య , అతడి భార్య ఇద్దరు వచ్చి ఇంటి గుమ్మం వద్ద దిగులుగా కూర్చున్నారు దానితో రాము వాళ్ళ పిన్ని నీ అడుగుతాడు ఎం జరిగింది పిన్ని అని కానీ....ఆమె ఎం చెప్పదు ..మళ్ళీ తన తండ్రికి అడుగుతాడు ..జరిగింది మొత్తం చెప్తాడు.
చెప్పగానే రాము చాలా ఏడుస్తాడు...రాము పిన్ని నీ చూసి ఏడువకు పిన్ని అని దగ్గరకు వెళ్తుంటే దూరంగా నెట్టేస్తుంది...రాము ఏడుస్తూ లోపలికి వెళ్తాడు .ఆమె తన కొడుకు కోసం బాధ పడుతూ భోజనం చెయ్యటం మానేసింది దానితో రాము పళ్ళెం లో అన్నం పెట్టుకొని వాళ్ళ పిన్ని కి తినిపించటానికి వెళ్తుంటే పల్లెంని చేతితో నేటేస్తుంది....రాము తన పిన్నికి ఎలాంటి బాధ కలుగకుండా తన తల్లిలా చూసుకుందాం అనుకుంటాడు కానీ.. తను మాత్రం రాముని ఎప్పుడు కొడుకులా ...కనీసం మనిషిలా కూడా చూడలేదు
అయినా కూడా రాము తన పిన్నిని మా అమ్మే కదా అనుకున్నాడు ..రాముకి పెళ్లి జరిగింది తన భార్యతో ప్రేమ్ విషయం మొత్తం చెప్పాడు రాము . దానితో రాము , తన భార్య కలిసి ప్రేమ్ కోసం వెతకటం మొదలు పెట్టారు .....వెతుకుతూ .... ఉండగా ఒక అనాదశరణాలయంలో ఉన్నట్టు తెలిసింది...వెళ్లి తీసుకొని ఇంటికి వచ్చారు......
రాము ఇంటికి వచ్చి అమ్మ ఎవరచ్చారో చూడు అని అంటాడు ..కానీ ఆమె నీకు నేను అమ్మను కాదు అని కసురుకుంటూ....కోపంగా లోపలికి వెళ్తుంది . అప్పుడు ప్రేమ్ అమ్మ అని పిలుస్తాడు కానీ మళ్ళీ రామునే అలా అన్నాడేమో అని కోపంగా బయటకు వచ్చి ఊరికే నువ్వు నన్ను అలా పిలువకు అని అంటుంది కానీ అంతలోనే మళ్ళీ అమ్మ అనే పిలుపు వినిపిస్తుంది ...... ఆ పిలుపు ఎవరిదా అని బయటకు వెళ్లి చూసే సరికి గుమ్మం వద్ద నిలుచొని ప్రేమ్ కనిపిస్తాడు అప్పుడు ఆమె ప్రేమ్ నీ పట్టుకొని ఏడుస్తుంది........
అప్పుడు ప్రేమ్ ఎడువకు అమ్మ అని అంటాడు.....అప్పుడు ఆమె ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది.....ఆ రోజు మీరు పడుకోగానే నాకు అన్నయ్యని చూడాలనిపించింది ...... అన్నయ్య ను చూడటానికి అని బయటకు వచ్చి దారి తప్పాను అమ్మ ....
మళ్ళీ ఎప్పటికీ మిమ్మల్లి కలువలేను అనుకున్న...కానీ.... అన్నయ్య వల్ల మనం అందరం కలిసాము ..... అన్నయ్య నాకోసం నేను తప్పి పోయినా రోజు నుండి వెతికాడు నువ్వు భాదపడటం చూడలేక ... అలాంటి అన్నయ్యని ఎన్ని కష్టాలు పెట్టావు అమ్మ అని ప్రేమ్ తన అమ్మతో అంటాడు అప్పుడు తనుచేసిన తప్పు తెలుసుకొని రాముని పిలుస్తుంది ..రాము చెప్పు పిన్ని అని అంటాడు .....అప్పుడు పిన్ని అని కాదు అమ్మ అని పిలువు అని అంటుంది అప్పుడు ప్రేమ్, రాము ,రాము భార్య, రాము తండ్రి కళ్ళల్లో ఆనందభాష్పాలు వరదలా వచ్చేస్తున్నాయి అప్పుడు ఆమె ప్రేమ్ ని,రాముని దగ్గరకు తీసుకొని ఎన్ని రోజులు ఇంత మంచివాడని కష్టపెట్టాన అని అనుకొని ఇద్దరినీ దగ్గరకు తీసుకొని తన గుండెలకు హత్తుకుంటుంది...దీనితో అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు......
కలిసుంటే కలదు సుఖం.....
-రాజ్యలక్ష్మి,ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,
0 Comments