పట్టపగటి వేళలో నచ్చినపేరు వచ్చి
పలుకై నన్ను పలుకరించినపుడు
నా మది పులకరించి
పరవశించించి పోయింది.
ఆ పేరుతో పరిచయం ఏర్పడింది.
******
కానీ ఇంతలో..........
ఆ పేరుకు ఏమైందో తెలియదు
నేను ఏమన్నానో నాకు తెలియదు
నేను ఏం చెప్పాలనుకుంటున్నానో గ్రహించకుండా...
చెప్పడానికి సమయం ఇవ్వకుండా...
మరచిపోయి కూడా నువ్వు నాతో మాట్లాడవద్దని
మని ఉండగానే నా మనసుని మట్టిలో కలిపింది.
ప్రాధేయపడినా పట్టించుకోకుండా
పట్టుమని పది రోజులు కూడా పలుకరించకుండా
నా పేరును పాతిపెట్టింది.
అర్థం చేసుకోకుండా
అపార్ధం చేసుకుంది.
అయినా కూడా...
నీ స్నేహం కోరే
స్నేహితురాలిని
నీ మంచిని కోరే
మనసున్న మనిషిని
నిన్ను అభిమానించే
అమ్మాయిని
ఏమి తెలియని
అమాయకురాలిని.
******
ఇంతకీ ఆ పేరుతో చెప్పాలనుకున్నది ఏమిటంటే........
" మనసుకు నచ్చిన పేరు గల
మనిషితో స్నేహం చేయాలని
పదేళ్ళ నుండి నేను
పడిగాపులుగాసానని...........
పరితపించిపోయానని..........
ప్రాణం పోయేలా
ఎదురు చూశానని.............."
******
నీ స్నేహం పొందటానికి
అర నిముషం అయినా సరే
ఆనందంగా స్వీకరిస్తానని
అరచేతిని చాచి ఉంచి
ఆర్థిస్తున్నాను మిత్రమా..!
******
మనసుకు నచ్చిన పేరు
"రాహుల్"
******
-జగ్గు.భవాని D/o రాజయ్య.
ఎం.ఏ.తెలుగు (2016 - 2018)
ప్రభుత్వ డిగ్రీ&పిజి కళాశాల,సిద్దిపేట.
0 Comments