ఒక చెరువు..... ఆ చెరువు గట్టున ఒక ఊరు. ఆ ఊరిలో ఒక ధనికుడు ఉండేవాడు. అతను చాలా మంచి మనిషి..,మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు.అతనికి పెళ్ళి అయింది , కానీ పిల్లలు లేరు . అతనికంటే తర్వాత పెళ్ళి అయిన వారికి ఇద్దరు , ముగ్గురు పిల్లలు పుట్టారు, కానీ ఇతడికి పిల్లలు లేరు. ఈయన ఏ విషయంలోనైనా చాలా సంతోషంగా ఉండేవాడు...ఈయన ఇంటికి వచ్చి చూస్తే అతడి భార్య ఎప్పుడు దిగులుగా కనిపించేది. ఆమెను చూసి ఇతను బాధపడేవారు.
వీరు సంతానం కోసం ఎన్నో నోములు నోచారు , ఎన్నో మొక్కులు మొక్కరు, దానాలు , ధర్మాలు చేశారు...కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈమెను చూసి వారి ఇంటికి కాపల ఉన్న కుక్క కూడా చాలా బాధపడేది.
ఆ కుక్క కూడా దేవుడిని ప్రార్థించేది..తన ఇంటి యజమానికి సంతానం కలగాలని. ఒకరోజు వీరిద్దరూ కలిసి ఒక మహర్షి వద్దకు వెళ్తారు అతను వారియొక్క సమస్యను అడిగి తెలుసుకొని ఆ సమస్యకి పరిష్కారం చెప్తాడు.
చాలా రోజుల తర్వాత గర్భం దాల్చింది...అదే సమయంలో వారి ఇంటికి కాపల ఉన్న కుక్క కూడా గర్భంతో ఉంది. ఆమెకు ఐదు నెలలు నిండగానే అంగరంగ వైభవంగా సీమంతం చేశారు..
ఆరోజు ఇంటికి అందరినీ పిలచి ఆశీర్వాదాలు తీసుకొని వారికి కడుపు నిండా అన్నం పెట్టి .పసుపు,కుంకుమ పళ్ళను వాయనంగా ఇచ్చి పంపించింది. కానీ వారి ఇంటికి కాపల ఉన్న కుక్కకు మాత్రం అన్నం పెట్టలేదు.
దానితో ఆ కుక్క ఆమెకు ఒక శాపం పెడుతుంది . ఏమిటంటే నాలాంటి ( కుక్క) పిల్లలు ఆమెకు , తనలాంటి (మనిషి) పిల్లలు నాకు పుట్టాలి అని దేవుడిని కోరుకుంటుంది. ఆమెకు నెలలు నిండిన కొద్ది చాలా సంతోషంతో ఆనందంగా ఉంటుంది. తొమ్మిది నెలలు నిండినవి ప్రసవం అయింది . అక్కడ జరిగిన సంఘటనను చూసి యజమాని ఆశ్చర్యపోతాడు .
ఎం జరిగింది....?
సీమంతం రోజున తన ఇంటికి కాపలా ఉన్న కుక్క పెట్టిన శాపం వల్ల తనకి కుక్క పిల్లలు పుట్టినవి.... ఆచార్యంతో ఆ యజమాని ఇంటికి వచ్చి చూసే సరికి వాళ్ళ ఇంటికి కాపలా ఉన్న కుక్క కూడా ప్రసవించింది.... ఇక్కడ ఒక వింత జరిగింది.అక్కడ తన భార్యకి కుక్క పిల్లలు పుడితే ..,ఇక్కడ కుక్కకు మనిషి పిల్లలు పుట్టారు.. ఇది చూసిన యజమాని ఆశ్చర్యపోతాడు.. వెంటనే ఎవ్వరికీ తెలియకుండా ఆ కుక్కకు పుట్టినటువంటి పిల్లలను తన భార్య దగ్గరకు తీసుకెళ్ళి..జరగవలసిన కార్యక్రమాలు అన్ని జరిపించేస్తాడు.
కొన్ని సంవత్సారాలు గడిచినవి. ఆ పిల్లలు చదువుకొని మంచి స్థానంలో ఉంటారు .అంతకు ముందే ఆ పిల్లలకు వాళ్ళ తల్లి ఎవరో తెలుస్తుంది...
వాళ్ళు పెళ్ళిలు చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డారు కానీ...తల్లి మీద ఉన్న ప్రేమతో వారు ఇంటికి వస్తారు.. తీరా వచ్చి చూస్తే వాళ్ళ తల్లి అంటే ఆ ఇంటికి కాపలాగా ఉన్న కుక్క కనిపించలేదు.
ఈ పిల్లలు వెళ్ళిపోగానే ఎప్పటికైనా ఈ కుక్క వల్ల ప్రమాదమే అని ఇంట్లో నుండి గెంటేస్తుంది ఆ ఇంటి యజమానురాలు... ఈ పిల్లలు ఇంట్లో ఉంటూ వాళ్ళ అమ్మ కోసం వెతుకుతారు . అనుకోకుండా ఒకరోజు ఈ పిల్లలు దిగులుగా రోడ్డు ప్రక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంటే వాళ్ళ అమ్మ అరిచినట్టు వినిపించింది.. దానితో వారు లేచి అటూ, ఇటూ చూశారు ..వాళ్ళ తల్లి చెత్త కుప్ప ప్రక్కన మూలుగుతూ పడుకొని ఉంది. అప్పటికే దాని ఆరోగ్యం బాగాలేదు ..
వెంటనే పిల్లలు వాళ్ళ అమ్మ వద్దకు వెళ్లి ఏడ్చారు అప్పుడు ఆ కుక్క చాలా ఆనందపడింది వీళ్ళు దానిని వైద్యశాలకు తీసుకొని వెళ్లి చూపించారు ..దాని ఆరోగ్యం బాగుపడింది.
అప్పుడు ఆ కుక్క చాలా ఏడ్చింది వీళ్ళు కూడా ఏడుస్తారు .ఎందుకంటే నిజం ఎందుకు చెప్పలేదు అని...... వీళ్ళు వాళ్ళ తల్లిని తీసుకొని వెళ్తుంటే ఆ ఇంటి యజమానురాలు చూసి ఏమిటి అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మన ఇంట్లోనే ఉండండి అని అనగానే వాళ్ళు ఛీ...... నీకన్న పశువు నయం మా అమ్మ నీకు సంతానం కలుగాలని ఎన్ని దేవుళ్ళను వేడుకుందో తెలుసా .....కానీ...నువ్వు నీ సీమంతం రోజున బుక్కేడు అన్నం పెట్టలేవు అందుకే నీకు ఈ విధంగా జరిగేలా చేశాడు ఆ దేవుడు ....
అయినా ఈ విషయం మీకు ఎలా తెలుసు...! అని యజమానురాలు అడిగింది అప్పుడు వీళ్ళు, నీవల్లనే తెలిసింది అంటారు...ఆమె ఆశ్చర్యపోతుంది..నా వల్లన...ఎలా..? అని అంటుంది ఒక రోజు నీ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అనుకొని మా అమ్మ గురించి ఆలోచిస్తూ మా అమ్మ గురించి నువ్వు మాట్లాడుకున్న మాటలు అన్ని విన్నాము..అప్పుడే తెలిసింది అని చెప్పారు ..
అదే సమయంలో వీళ్ళ భర్తలు వస్తారు.ఎం జరిగింది అనీ అడుగుతారు ..వెంటనే వీళ్ళు జరిగిన విషయం పూర్తిగా వివరించి చెప్పి ,వీళ్ళు వారి తల్లిని తీసుకొని వెళ్లి అందరూ ఆనందంగా ఉంటారు.
సేకరణ-రాజ్యలక్ష్మి,ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,
0 Comments