సాయంత్రం టీ తాగాక విశ్రాంతిగా కూర్చుని టీవీ లో సీరియల్ చూస్తుంది రాధ...

 అంతలో ఫోన్ రింగ్ అయ్యింది.. చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసిన రాధా కి ఫోన్ చేసింది తన చిన్ననాటి స్నేహితురాలు గంగా అని తెలిసి ఎంతో సంతోషంగా చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు.

 అప్పుడు రాధ సరేలే మరి... ఇంత కాలానికి నేనెలా గుర్తు వచ్చాను? అని అడగ్గా.

 మా చుట్టాలబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని చేశాను... మొన్న మీ అమ్మాయి పుట్టిన రోజున తెలిసిన వాళ్లు స్టేటస్ పెడితే చూశాం... అమ్మాయి అందంగా అనుకువ గా అనిపించింది అందుకే ఒకసారి అడుగుదామని చేశాను... అని గంగా అన్నది.

 ఒక్కసారి అనేకరకాల ఆలోచనలతో మునిగిపోయిన

రాధకి ఏమంటావు...? అని గంగా పిలుపుతో తేరుకుంది రాధ... దానికి రాధ నవ్వుతూ తర్వాత ఫోన్ చేసి చెప్తా అని ఫోన్ కట్ చేసింది..

                                    * * * * * * * *

 అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన మధుకి టీ అందిస్తూ జరిగిన విషయం చెప్పింది రాధ..

 రాత్రి భోజనం చేశాక తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తున్నాడు మధు.. అప్పుడు రాదా కోపంగా.... హు... ఉదయం లేవగానే ఆఫీసుకి హడావిడిగా వెళ్లడం.. రాగానే ఫోన్ కో టీవీ కో అతుక్కుపోవడం... 🙄

 అంతే కానీ భార్య పిల్లలు, బాధలు బాధ్యతలు ఏదీ లేదు..

 చూడు...రాధ ఇప్పుడు ఏమైందని....ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్..?

 అని అడిగాడు మధు..ఏమైందా..? ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి ఉన్నదని మర్చిపోయారా..?

 ఇంతకాలం చదువు చదువు అంటూ గడిపేసింది..

 ఇకనైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా లేదా..?

 అంటూ గట్టిగా బాధతో అరిచింది రాధ..

 రాధ మాటలకి మధు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు..

 నా భాద నీకు అర్థం కాదు అంటూ... విసవిసా నడుచుకుంటూ పక్క మీదకు చేరి ముసుగుతన్ని పడుకుంది. తాను కూడా టీవీ ఆపేసి పక్క మీదకి చేరాడు మధు..

 కానీ మధు మనసంతా ఆలోచనలతో నిండిపోయి నిద్రపట్టలేదు... 😐

 మర్నాడు ఉదయం లేవగానే మధు... తన కూతురు గీతా కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.. గీత కూడా అంగీకారం తెలపడంతో రాధ-మధు ల ఆనందానికి అవధులు లేవు... 😇

 రాము కూడా పెళ్లికి అంగీకరించడంతో సంబంధాల గురించి ప్రస్తావించడం మొదలుపెట్టాడు...

 రాము గీత వాళ్ళ అన్నయ్య.. చాలా మంచివాడు. చెల్లెలు అంటే అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తి  🤗

                                    * * * * * * * *

 మర్నాడు ఉదయం గంగా మరల ఫోన్ చేసి అబ్బాయి గురించి చెప్పటం మొదలు పెట్టింది...

 అబ్బాయి పేరు రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి 80 వేల జీతం.. ఏ అలవాటు లేని మంచివాడు... ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయ్..దొరకడం చాలా కష్టం అంటూ.. వాళ్ళ అమ్మానాన్న,ఆస్తి పాస్తీ అన్ని వివరాలు చెప్పేసింది..😇

 దానికి సమాధానంగా ఒకసారి ఇంటికి తీసుకురా నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని అంది రాధ..

 సాయంత్రం భోజన సమయాన జరిగిన విషయం చెప్పింది రాధ..!

 వాళ్లు కూడా అంగీకారం తెలపడంతో సంతోషించింది..

 సరిగ్గా మూడు రోజులకు గంగ. రవి వాళ్ళని తీసుకుని రాధ వాళ్ళ ఇంటికి వచ్చింది..

 గుమ్మంలో నిల్చుని ఉన్న వారిని గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించారు 🤗

రవి 24 సంవత్సరాల అందమైన యువకుడు.. తెల్లని షర్ట్, చక్కగా మడిచిన హాండ్స్, నీలం రంగు జీన్స్ తో చూడగానే ఆకట్టుకునే అంత అందంగా కనిపించాడు రాధ వాళ్ళకి. 😇

 రవి వాళ్ళ అమ్మ కొంచెం కఠినంగా,హుందాగా.. రవి వాళ్ళ నాన్న మాత్రం మంచి వాడు,మర్యాదస్తుడు... అనిపించాడు రాముకి...

 గీతకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రుల కోసం ఒప్పుకుంది 😐

 ఇంతలో రవి వాళ్ళ అమ్మ... అమ్మాయిని చూపిస్తారా..? ఇంకా ఆలస్యం చేస్తారా..? అని అసహనంగా అడిగింది.. 🙄

 గీతా చాలా అందమైన... చురుకైన అమ్మాయి... చూడగానే నచ్చింది రవికి..

 గీత కి కూడా రవి ని చూడగానే మంచి అభిప్రాయం ఏర్పడింది..

 రవి వాళ్ళమ్మ సావిత్రమ్మ.. గీత ని నానా రకాల ప్రశ్నలు వేసింది.. గీత వాటన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పడం రాఘవయ్య కి బాగా నచ్చింది..

 రాఘవయ్య గీతతో.. మాకుంది ఒక్కడే కొడుకు... కోడలైన,కూతురైన నువ్వే... అని అనడం అక్కడున్న వారిని ఆకట్టుకునేలా చేసింది 😇

 గీతని లోపలకు తీసుకెళ్ళి తన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు..

 రవి వాళ్ళు కూడా గీత నచ్చిందని చెప్పారు..

 అప్పుడు సావిత్రమ్మ... అమ్మాయి నచ్చింది కానీ కట్నకానుకల గురించి మాట్లాడుకుందాం అని అన్నది.

మా అబ్బాయికి గొప్ప గొప్ప సంబంధాలు చాలా వస్తున్నా.. మీ అమ్మాయి నచ్చడం వల్లనే మీతో సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నాం అని అనడంతో..... మధు..దానికి బదులు ఇస్తూ...మీరు అడిగినవన్నీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నాడు.

సావిత్రమ్మ అడిగినవన్నీ ఇవ్వటానికి కష్టమైన ఒప్పుకున్నారు..

సావిత్రమ్మ వాళ్లు వెళ్ళిపోయారు..

                                                * * * * * * * *

 రాత్రి భోజన సమయాన...

 గీత వాళ్ల నాన్న తో వాళ్ళు అడిగినవన్నీ...ఇవ్వటానికి ఎందుకు ఒప్పుకున్నారు... 🙄

ఇది నాకు ఏ మాత్రం నచ్చలేదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది..

రాము గీత దగ్గరకు వచ్చి... నీవంటే మా అందరికీ ప్రాణం. నీ సంతోషం కన్నా ఏదీ ఎక్కువ కాదు...😊

ఇప్పుడు మంచి ఇంటికి ఇస్తేనే కదా..! మంచి స్థాయిలో ఉంటావు,ఎటువంటి ఇబ్బందులు ఉండవు.... ఎవరిపైనా ఆధార పడవు..కదా...!!!

అని చెప్పి వెళ్ళిపోయాడు...

ఇంట్లో వాళ్ళంతా పెళ్లి పనుల్లో మునిగిపోయారు... చూస్తుండగానే......నిశ్చితార్థం అయిపోయి పెళ్లి రోజు కూడా దగ్గరకు వచ్చింది .... 😇

రాధా వాళ్ళు పెళ్లి పనుల్లో మునిగిపోయారు... ఇంటికి బంధువులు రావడం కూడా మొదలైంది... ఎటు చూసిన హడావిడి... అయోమయ స్థితిలో గీత....😐

ఊర్లో ఉన్న పొలం అమ్మి.. వచ్చిన డబ్బును గీతకి కట్నంగా ఇచ్చారు.. ఒక్కగానొక్క అమ్మాయి వివాహం ఎటువంటి లోటు లేకుండా సావిత్రమ్మ వాళ్లకు సరిపోయేలా... ఘనంగా జరిపించారు... 😇

కెవి రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం


అప్పగింతల సమయం కూడా రానే వచ్చింది... కుటుంబ సభ్యులంతా ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యారు...

గీత మనసులో ఒక రకమైన బాధ... అమ్మాయి పెళ్లి కోసం తల్లిదండ్రులు ఇన్ని బాధలు భరించాలా....? అని ఆవేదన ని తన మనసులో దాచుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది... గీతకి అత్తగారిల్లు చాలా కొత్తగా అనిపించింది... ఇక్కడి సంప్రదాయాలకు వాళ్ళింట్లో సంప్రదాయాలకు చాలా తేడాగా అనిపించింది... గీత వాళ్ళది... మధ్యతరగతి కుటుంబం అయిన సంతోషానికి ఏ మాత్రం కొదువ ఉండేది కాదు...

ఇక్కడ అన్నీ ఉన్నా ఏదో వెలితి..

చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి...

ఉదయాన్నే పూజలో ఉన్న గీత...

అత్త అరుపుతో తేరుకుంది... సావిత్రమ్మ అంతే....పెళ్లయిన అప్పటి నుండి గీత అంటే చిన్న చూపు.. ఎప్పుడూ ఏదో వంకతో నసుగుతూ నే అరుస్తూనే ఉంటుంది... 🙄

ఇదంతా గమనిస్తున్న రాఘవయ్య ఎవరిని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు...

అతనికి తెలుసు సావిత్రమ్మ....తీరు..అంతే ఇక మారదు అని..

గీత ఇదంతా మౌనంగా భరిస్తుంది... ఎందుకంటే రవికి వాళ్ళ అమ్మ అంటే చెప్పలేనంత ఇష్టం... తన గురించి చెప్పి వారి...ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తేవడం ఇష్టం లేదు గీతకి...😐

                                                        * * * * * * * *

ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది... తమకి...వారసుడు రాబోతున్నాడు.. అన్న సంతోషంతో సావిత్రమ్మ రాఘవయ్య లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు... ఇంతలో సావిత్రమ్మ గీతతో....

ఈ విషయం మీ పుట్టింట్లో చెప్పి పుట్టబోయే బిడ్డ పేరిట 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పు అని కాటువుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది...

 రవి కూడా...తల్లికి వత్తాసుగా గీతని తన పుట్టింట్లో దింపి ఆఫీస్ కి వెళ్ళి పోయాడు....

                                                      * * * * * * *

గీత ను చూసి రాధ మనసు సంతోషంతో నిండిపోయింది..

కూతురు నీ దగ్గరకు తీసుకొని ప్రేమగా ఇంట్లోకి తీసుకెళ్లి.. టీ అందిస్తూ.....

అల్లుడుగారు.. రాలేదేంటి..? ఇంట్లో వాళ్ళు అంతా బాగున్నారా...?

అంటూ కుశల ప్రశ్నలు వేసిన గీత మౌనంగా తన గదిలోకి వెళ్ళింది..

కూతురికి ఇష్టమైన... వంటలు చేసి భోజనానికి పిలిచింది రాధ..

భోజన సమయాన కూడా గీత మౌనం వెనకాల కారణం దొరకలేదు రాధ కి..

రాము ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు.. చెల్లెల్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు..

సమయం గడిచిన గీత తన మౌనాన్ని వీడలేదు..

రాము.....గీత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు..

ఏమైంది గీత ఎందుకు ఇలా ఉన్నావు....? అని అడిగాడు..

తన చేతుల పై పడిన కన్నీటిని చూసి కంగారు పడ్డాడు రాము..

అన్న కంగారు చూసిన గీత... ఇది బాధతో వస్తున్న కన్నీరు కాదన్నా.... మిమ్మల్ని చూసిన సంతోషంతో వస్తున్న కన్నీళ్లు...

అని  నోరు విప్పింది..గీత

బాధ కు,సంతోషానికి తేడా తెలియని అంత అమాయకుడు కాదు మీ అన్నయ్య..

అసలు ఏం జరిగిందో చెప్పు అని మరలా ప్రశ్నించాడు....

నువ్వు మామయ్య వి  కాబోతున్నవ్...అన్నయ్య...

అని గీత చెప్పిన మాటలకి రాము రాధ...వాళ్ళు సంతోషం లో మునిగిపోయారు.... 😇

మరి ఇంత మంచి శుభవార్త చెప్పటానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావ్ గీత...? అని అడిగాడు రాము..

పుట్టబోయే బిడ్డ పేరిట 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యమంది .. మా అత్తయ్య..

 గీత మాటలకి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు రాము.. రాధ...!

రాము గీత కి సమాధానంగా... దీనికి ఎందుకు బాధ పడుతున్నావ్.... నేను నాన్న ఒక రెండు మూడు నెలల్లో..సర్దుతాం... అని..మీ అత్తయ్య తో చెబుతా.... అని అన్నాడు రాము..

గీత ఒక్కసారిగా కోపంగా ఇంకా ఎంతకాలం..... వాళ్ళు అడిగినవన్నీ పెడుతుంటారు... ఇప్పటికే నా పెళ్లి కోసం పొలం అమ్మారు...

ప్రతి పండక్కి బట్టలు... అది ఇది అంటూ... ఎప్పుడూ ఏదో ఒకటి పెట్టడం.... మీరేం పెట్టిన వాటిని మా అత్తయ్య తక్కువగా చూడటం... 🙄 మీరిలా పెడుతూనే ఉంటే... వాళ్ళు ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటారు.... మీరు ఇంకా కష్టాలు పడుతూనే ఉంటారు..

మీరు ఇలా కట్నం ఇస్తుంటే మాకు ఎలా ఉంటుందో తెలుసా....?

మీ  బరువును దింపుకోడానికి డబ్బు  ఇస్తున్నట్లు..

వాళ్లు మోయాలి కాబట్టి డబ్బులు తీసుకున్నట్లు... అనిపిస్తుంది... 😔

అంటూ 

ఉబికి వస్తూన్న కన్నీరును ఆపుకుంది గీత...

చాలా చదువుకున్నావు కదా...అన్నయ్య....!

కనీసం నువ్వైనా కట్నం తీసుకోకు.....

మమ్మల్ని ఆడపిల్లాలనే చూడండి...వస్తువుల్లా... భారంగా కాదు..

అంటూ ఏడవడం మొదలు పెట్టింది గీత..

రాము గీత కన్నీళ్లు తుడుస్తూ.. నేనే కాదమ్మా.. నాకు తెలిసిన వాళ్ళు కూడా కట్నం తీసుకోకుండా చూస్తాను అని చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు..

ఇదంతా.. గుమ్మంలో నిలబడి విన్న రవి... గీత దగ్గరకు వెళ్లి 

నన్ను క్షమించు గీత.. 

ఎప్పుడు....నిన్ను,నీ భావాలని అర్థం చేసుకోలేను...  అని

గీత ని దగ్గరకు తీసుకున్నాడు..

అందరి మనసులో ఒక సంతృప్తి భావన.. 

ఇంటికి వచ్చిన గీతతో.... ఏమన్నారు..?

నీ పుట్టింటి వాళ్ళు..... డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారా..?

ఇంకా ఏవైనా సాకులు వెతుకుతున్నారా..?

అంటున్న సావిత్రమ్మ మాటలు పూర్తికాకుండానే.....

ఇకనైనా నిన్ను నీ ఆలోచనలు మార్చుకో......

గీత మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి చూస్తున్నా.. ఎప్పుడూ ఏదో వంకతో అరుస్తూనే ఉంటావు... కూతురైన.. కోడలైన నువ్వేనమ్మా.....! అన్న..

ఒక్క మాటతో మనల్ని.. సొంత తల్లి దండ్రుల్లా చూస్తూ వస్తుంది  గీత..

నువ్వు కూతురిలా కాదు

కాదా...! కనీసం కోడలికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వడం లేదు... 

మనకి  ఏం తక్కువ.....? ఎప్పుడు చూసినా కట్నం కట్నం అంటూ వేయించుకుని తింటావు...

అన్ని ఉన్న కుటుంబం అనే

కదా.... గీత ని మన ఇంటికి కోడలిగా పంపారు...

నువ్వు ఎన్ని మాటలు అన్నా..

ఏనాడూ...తన పుట్టింట్లో కానీ,

మన అబ్బాయితో కానీ చెప్పలేదు.. అది గీత గొప్పతనం..

మనకి ఒక అమ్మాయి ఉంటే తెలిసేది...

అమ్మాయి పెళ్లి కోసం.... తల్లిదండ్రులు పడే బాధ... 

ఇకనైనా మారు.... సావిత్రమ్మ..అంటూ

తన గదిలోకి వెళ్ళిపోయాడు..

గీత రవి లు కూడా... తమ గదిలోకి వెళ్ళి పోయారు.....

సావిత్రమ్మ..... ఆలోచనలతో మునిగిపోయి...

హాల్లోనే కూర్చుండిపోయింది....

-----------------

నవ్యవాణి కంచర్ల,

ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,

ప్రభుత్వ డిగ్రీ&పిజి కళాశాల,సిద్దిపేట.