" కొన్నాళ్ళకి మెలుకువ వచ్చి కనులు తెరిచా....... నా కలలన్నీ చెదిరి మిగిలింది కన్నీరే "
నేను కోరుకున్న నా ఈ జీవితం ఇది కాదు......!
అందరూ కలిసి మెలిసి ఉండే జీవితాన్ని కోరుకున్నా నేను.....కానీ.... ఏది కూడా నేను అనుకున్నట్టుగా జరగటం లేదు ఎందుకు.....?
ఈ నా ప్రశ్నకు సమాధానం అంతుచిక్కట్టం లేదు........!
సంవత్సరం కిందట నువ్వు నన్ను అడిగావు పెళ్ళి చేసుకుందామా.....అనీ...... కానీ అప్పుడు ఆ సమయంలో నోరు మెదపలేని పరిస్థితి ఎందుకంటే నీమీద ప్రేమ లేకనో , నమ్మకం లేకనో కాదు....
నువ్వంటే నాకు పిచ్చి....
నేను నీ గురుంచి ఇంట్లో అడిగితే ఇటూ నిన్ను నాకు దూరం చేసి ...వేరే అబ్బాయితో పెళ్ళి చేస్తే నీకు దూరంగా ఉండే పరిస్థితి వస్తుందేమో అని భయపడ్డాను .
అప్పటికైనా నువ్వు ఇంట్లో చాలాసార్లు అడిగావు అక్షరని నేను పెళ్ళి చేసుకుంటా అనీ.....కానీ దానికి ఎవ్వరు ఒప్పుకోలేదు... నీకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టగానే..... నా గుండె బరువు నాకు తెలిసింది . బాధతో నా గుండె బరువును మొయలేకపోయాను .
ఆ సమయంలో నేను ఆ బాధను భరించలేక నేను కూడా అడిగాను......అఖిల్ ని పెళ్ళి చేసుకుంటాను అని కానీ..దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వద్దు ఇద్దరు ఒకే ఇంటికి ఎలా వెళ్తారు ( అక్క,చెల్లెలు ఒకే ఇంటికి ఎలా వెళ్తారు ) నీతో ఎవ్వరు చెప్పారు అలా పెళ్ళి చేసుకోవచ్చు అని..నన్ను తిట్టారు.
అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది నన్ను క్షమించు అఖిల్.....
అప్పుడు నేను ఆలోచించి నీ గురుంచి తీసుకున్న నిర్ణయం... నీకంటూ ఒక తోడు వుంటే నీకు ఎటువంటి కష్టం వచ్చిన చెప్పుకోడానికి ఒకరు వుంటారు...అలాగే నీ ఆరోగ్యం గురించి... నీ మంచి చెడుల గురించి...నీ గురుంచి ఆలోచించడానికి ....నీకంటూ ఒక తోడు కావాలి అనిపించింది.....
అందుకే నీకు పెళ్లి చేసుకో అని చెప్పాను ..... మరి నేను పెళ్ళి చేసుకుంటే నువ్వు ఏమైపోతావు అని అక్షరని అడుగుతాడు అఖిల్ . అప్పుడు వెంటనే అక్షర అంటుంది నువ్వు పెళ్ళి చేసుకొని సంతోషంగా వుంటే చాలు నేను కూడా సంతోషంగా ఉంటా అని అంటుంది అక్షర .
దానితో అఖిల్ సరే నువ్వు చెప్పినట్టే పెళ్ళి చేసుకుంటాను కానీ నువ్వు చూసి , నీకు నచ్చితేనే నేను తనని పెళ్ళి చేసుకుంటాను అని అంటాడు అఖిల్ దానికి సరే అని ఒప్పుకుంటుంది అక్షర.
అంతలోనే పెళ్లి కుదురుతుంది అఖిల్ కి . అక్షర పెళ్లికి వెళ్ళింది అదే సమయంలో అఖిల్ మరియు పెళ్ళి కూతురు ఫొటోస్ దిగుతుండగా అక్షరని అఖిల్ చూసాడు .....చూడగానే ముఖంలో ఎదో.....దిగులు ... ఆ దిగులు గమనించిన అక్షర అక్కడ ఎక్కువ సేపు వుండటం మంచిది కాదు అని కొంచెం దూరంగా వెళ్ళింది .
ఐనా కూడా అఖిల్ చూపులు అక్షర కోసం వెతుకుతూనే ఉన్నాయి అది చూసి అక్షర తట్టుకోలేక పోయింది కళ్ళల్లో నుండి వచ్చేవి కన్నీరా....,లేదా సముద్ర ప్రవాహామా అన్నట్టుగా ఉంది .
కొద్దిసేపటికి అఖిల్ వద్దకు వెళ్ళి పెళ్ళిపీటల మీద కూర్చోపెట్టింది అఖిల్ కి ఇచ్చిన మాట ప్రకారం . కానీ తర్వాత జరిగే దానిని తలుచుకొని అఖిల్ తో నేను అలా పక్కన నిల్చుంటాను అనీ చెప్పింది అక్షర . సరే కానీ నువ్వు నేను చూసినప్పుడల్లా నాకు కనిపించాలి అని అంటాడు అఖిల్ సరే అంటుంది అక్షర .
కానీ......అక్షర తట్టుకోలేక పెళ్ళి మండపం నుండి దూరంగా వెళ్ళింది కొంచెం సేపటికి అఖిల్ చూసాడు కానీ అక్షర కనిపించటం లేదు అఖిల్ మండపంలో ఉన్న అఖిల్ మనస్సు మాత్రం అక్షర కోసం పరితపిస్తూనే ఉంది మొత్తానికి పెళ్లి అయింది.
కొన్ని రోజులు అందరూ సంతోషంగానే ఉన్నారు . కొన్నాళ్ళకి గొడవలు మొదలయ్యాయి దానితో అఖిల్ తన ప్రియురాలు అయినా అక్షరతో ఇలా అన్నాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఉండుంటే ఈ గొడవలు జరిగేవి కావు నువ్వు అనుకున్నట్టు అందరం కలిసి సంతోషంగా ఉండే వాళ్ళం అని అంటాడు అఖిల్.
గొడవలు పెరిగి వేరుగా కాపురం పెట్టారు అయినా కూడా గొడవలు తగ్గటం లేవు . దాని చూసి అఖిల్ ప్రియురాలు అయినా అక్షర తట్టుకోలేక పోయింది..... ఒక వైపు ప్రేమించిన వ్యక్తి....మరో వైపు సొంత అక్క...... ఏమి చెయ్యలేని పరిస్థితి.
ఇప్పటికి అఖిల్ కి , అక్షరకి ఒకరంటే ఒకరికి ప్రాణం......కానీ దూరంగా ఉండి ఒకరిని ఒకరు చూసి పరితపించటం తప్ప చేసేది ఏమి.... లేదు......
కొన్ని రోజులకు అక్షరకి పెళ్లి సంబధాలు చూద్దాం అని ఇంట్లో వాళ్ళు అనుకుంటుండగా అక్షర విన్నది . అప్పుడు అక్షర ..........ఒకరిని ప్రేమించి...ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎంత బాధ ఉంటుందో అర్థమయింది . ఆ రోజు అఖిల్ గుండె ఎంత ప్రేమతో అఖిల్ చూపులు అక్షర కోసం పరితపించిందో అర్థమయింది .
అప్పుడు అక్షర పెళ్లి విషయాన్ని తన అమ్మానాన్న లతో మాట్లాడి కొంత కాలం వరకు వాయిదా వేసింది కానీ..అఖిల్ ప్రతీ రోజు కుమిలిపోతున్నాడు ప్రేమించిన అమ్మాయి నీ తన సొంతం చేసుకోలేకపోయాను అని...ఇటూ అమ్మాయి ...., అటూ అబ్బాయి ఇద్దరు కూడా కుమిలిపోతున్నారు.
అక్షర , అఖిల్ తో ఒక మాట చెప్తుంది ....బంగారం ....
"నేను కవిని కాక పోయినా నీ పేరు రాసినప్పుడు మాత్రం గొప్ప కవిలా అనుభూతి చెందుతాను"....... అని చెప్పింది అక్షర .
పిచ్చి దాన నువ్వు అప్పుడే నా మాట వినుంటే ఇప్పుడు ఇద్దరం బాధపడేవాళ్ళం కాదు...మనిద్దరం ఒకరిని ఒకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం......
మనిద్దరి వలన మరో ఇద్దరి జీవితాలు నాశనం చేయటానికి సిద్ధపడ్డాము.ఇటూ మనం సంతోషంగా లేము.....మనల్ని పెళ్ళి చేసుకున్న వాళ్ళని సంతోషంగా ఉంచలేము......చూశావా ఇలా ఎన్ని జీవితాలు నాశనం చేస్తున్నాం మనం......
నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అని అఖిల్ అక్షరని కౌగిలించుకొని ఏడుస్తాడు ..అక్షర కూడా తట్టుకోలేక పోతుంది .
కొన్ని రోజులకు అక్షరకు పెళ్లి కుదిరింది కానీ అక్షరకి ఇంకొకరితో తన జీవితాన్ని పంచుకోవటం ఇష్టం లేదు.....దానితో అక్షర బంగారం మనం కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుకూలంగా మారవలసివచ్చింది . ఇప్పటి వరకు మారుతానులే నిన్ను మరిచిపోతెనేమో అని అనుకున్న కానీ ....నీకు ఎంత దూరంగా ఉంటే అంత దగ్గర కావాలి అనిపిస్తుంది......నీతో ఎంతగా మాట్లాడకుండా ఉండాలనుకుంటున్నానో అంతకు వెయ్యి రెట్లు మాట్లాడాలి అనిపిస్తుంది నా వల్ల కావడం లేదు బంగారం...
"నిన్ను మరిచిన మరు క్షణం అదే నా చివరి క్షణం"
" కాలాలు మారినా కళలు కనుమరుగైనా కవితలు అంతమైనా నేను నా ప్రాణాన్ని వీడిన గాలినై మళ్ళీ వస్తాను నీ ప్రేమకోసం" ........అని ఉత్తరం రాసింది అక్షర ...అఖిల్ కి .
పెళ్లి మండపంలోకి అక్షరని తీసుకువచ్చారు పంతులు మంత్రాలు చదువుతున్నాడు.......పెళ్ళికొడుకు లేచి అక్షర మెడలో తాళికట్టే సమయానికి అక్షర గుండె చప్పుడు ఆగిపోయింది ...అదే సమయానికి తన ప్రియుడు అఖిల్ గుండె చప్పుడు కూడా ఆగిపోయింది .ఇద్దరు ఒకేసారి చనిపోయారు.
ఇంత వరకు పెద్దవాళ్ళకు అర్థం కాని ప్రేమ వారి చావుతో అర్థమయింది ........
కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి
"దీన్ని బట్టి వీరి ప్రేమ ఎంత అమూల్యమైనదో అర్థమవుతుంది మనకు"
-రాజ్యలక్ష్మి,ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,
0 Comments