చదువే మానవ మనుగడకి జీవం

జ్ఞానార్జనకి విద్యే విలువైన అస్త్రం

విద్యని అర్థిస్తూ ఆరాధిస్తే తనే అందిస్తుంది అమృత హస్తం

విద్యాలాపనలో మునిగితే మనిషికి ఉండే కష్టాలు శూన్యం 

విద్య వెలకట్టలేని విజ్ఞాన భాండాగారం

మధ్యతరగతి కుటుంబాలకు సురులు ప్రసాదించిన కల్పవృక్షం 

అలనాడు ఆదిమానవుడి కాలం నుండి

ఏ మాటలు పుట్టని రోజుల నుండి

భావం తెలపాలని ఆతృతలో తొలి స్వరం వినిపించెను భాషగా

ఆ విజ్ఞానమే అంచెలంచెలుగా పెరిగేను శాస్త్రంగా

ఎదిగేను మానవ అసాధారణ ప్రతిభకి అర్థంగా

తరతరాల త్యాగంగా,విరిసెను చదువులు వేగంగా

చదువుకి ఏ కులమున్నదిరా, ఏ మతం చదువుని కన్నదిరా

మానవతకి ఇది సన్నిదిరా,నీ వ్యధలు తీర్చెటి ఆపద్బాంధువురా...

యం.సాత్విక,

బి.కామ్ తృతీయ సంవత్సరం