ఓ కర్షకా!హలం పట్టి పొలం దున్ని
స్వేదజలాన్ని ధారపోసి మన్నుల నుండి అన్నం తీస్తున్నావు
ఎన్ని ఎదురు దెబ్బలు నిన్ను తాకినా ఎదురేగి నేలనే నమ్ముకొని బతుకు సేద్యాన్ని ఈడుస్తున్నావు
కరం కరం నిరంతరం రాత్రి పగలు పని చేసి జీవిస్తునావు
క్షణక్షణం అణుక్షణం అసమానపు బతుకుతో నలిగిపోతున్నావు
శ్రమని నమ్ముకొని కర్మకి ఓర్చుకొని రంగంలో అడుగు పెడతావు
రేపన్నది ఎలా ఉన్నదో తెలియక నీ పాలిట రణరంగమయ్యి ఏడుస్తున్నావు
రెక్కాడితే డొక్కాడదని లేనినాడు పస్తులుండి కాలాన్ని గడుపుతున్నావు
దుమ్ముని ధూలిని లెక్కజేయక నేలని దున్ని కర్రుగట్టి నున్నగా చేస్తావు
రాళ్లు రప్పలు లెక్కజేయక నొప్పులు మరిచి నిప్పులకొర్చి విత్తనాలు వేస్తావు
నీడ,నిద్ర ఏది లేక నీళ్ళు కట్టి పొలాన్ని తడుపుతావు
వరుణ దేవుడు కరుణ చూపక నిప్పులు కురిసే ఎండలే నీ స్నేహం చేసుకున్నావు
కలుపు తీసి పంట తీసి కరువు నుండి వరద నుండి కావలుంటావు
కష్టసుఖాలకోర్చి సద్దులు మొద్దులు మోసి చక్కగా పెంచుతున్నావు
మందుకొట్టి చంటి పాపాయిల్లా పెంచి భారీ కూలీలు చెల్లించినావు
కొన్ననాడు కొరతతో అమ్మిన నాడు అప్పులతో అల్లాడుతునావు
అన్నా,రైతన్నా! ఎన్ని చేసినా నీ కష్టాలని ఆదుకొనేవారు ఎవరున్నారు
నీకు నువ్వే దిక్కన్నా,నీది నీవే రైతన్నా
పిరికి పనులు ఆపివెయ్యు,ఆత్మహత్య దిక్కు కాదు
తల్లిదండ్రుల మాదిరి దేశానికే వెన్నుపూస నువ్వు
నిష్కల్మషంతో అందరికీ అన్నం పెట్టే అన్నదాతవి నువ్వు
ఏనాడూ చెదిరిపోకు అదిరిపోకు,బెదిరిపోయి రాలిపోకు
నిత్యపోరు వృత్తి మన వ్యవసాయం,పోరాడి గెలిచినప్పుడే అందుకుంటావు నీ జయం..
అదే నీ ఉన్నత శిఖరం
పేరు:యం.సాత్విక
ఊరు: లచ్చపేట
చదువు: బి.కామ్ తృతీయ సంవత్సరం
0 Comments