జయరాం.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

అతని భార్య సీత... వారికి ఇద్దరు పిల్లలు రోషన్, రోష్ణ..

తమ ఇద్దరు పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచి.. పెద్ద చేసి నచ్చిన చదువులు చదివించారు.... వారికి నచ్చిన వారిని ఇచ్చి పెళ్లిళ్లు కూడా చేశారు...

రోషన్ కి అమెరికాలో ఉద్యోగం రావడంతో తన భార్యా పిల్లలతో అక్కడే స్థిరపడి పోయాడు..

రోష్ణ కూడా తన భర్త పిల్లలతో యూకే లో స్థిరపడిపోయింది.

జయరాం సీతాలు... తమ బాధ్యతలను తీర్చుకొని.. శేష జీవితం గడుపుతున్న సమయంలో సీత అనారోగ్యంతో మరణించింది..

తమ తల్లి అంతిమ సంస్కారాలు కూడా చేసేందుకు తీరిక లేనంతగా మారిపోయిన తన పిల్లల్ని చూసి కుంగిపోయాడు... 😐

నెలలు గడిచిపోయినా తమ పిల్లల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో...

జయరాం.. ఒంటరిగా,ధైర్యంగా బతకడం మొదలుపెట్టాడు ..

                  ******

సాయంత్రం పార్కులో వాకింగ్ చేస్తున్న జయ రామ్ కి

ఒక పసి పిల్లవాడి ఏడుపు వినిపించింది..

దగ్గర దాకా వెళ్ళిన జయరామ్ కి చెత్తబుట్టలో అంగవైకల్యంతో పుట్టిన బాబు కనిపించాడు...

బాబుని దగ్గరకు తీసుకొని.. అటుగా వెళ్తున్న వారిని అడిగి చూసాడు.. బాబు కి ఒక కాలు లేకపోవడం వలన పెంచుకోవడానికి ఎవరు ఇష్టం చూపలేరు....

జయరామ్ ఆ బాబుని పెంచుకోవాలని నిశ్చయించుకున్నాడు.. తన ఇంటికి తీసుకు వెళ్లి...రిషి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టాడు..🤗

చూస్తూ ఉండగానే ఏళ్ళు గడిచిపోయాయి..

                  ******

 రిషి.... ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ నాన్న ఎక్కడ... తాతయ్య  ఎప్పుడు వస్తారు...? ఎక్కడున్నారు....? అంటూ జయరాం ని ప్రశ్నించేవాడు...

జయరామ్ అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీసే వాడు...

 సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన రిషి... ఏమీ తినకుండా దిగులు గా కూర్చోవడం గమనించాడు జయరాం... ఏమైంది...?రిషి అని ప్రశ్నించగా...

తాతయ్య... ఉదయం  స్కూల్లో మా టీచర్ తో డాక్టర్ అవుతానని చెబితే... అందరూ నన్ను చూసి నవ్వి... కాలు సరిగా లేదు కానీ....

డాక్టర్ అవుతాడట.. డాక్టర్..🙄

 అంటూ ఎగతాళి చేశారు... అలాగే నీకు అమ్మ నాన్న కూడా లేనట్టున్నారు.... అందుకే స్కూల్ ఏ ఫంక్షన్ జరిగిన మీ తాతయ్య ని తీసుకొని వస్తావు అంటూ ఏడిపించారు...

అసలు మా అమ్మ నాన్న ఎక్కడున్నారు....? తాతయ్య..ఎప్పుడు అడిగినా వాళ్ల గురించి చెప్పావు... అని దిగులుగా అన్నాడు..😐

 అప్పుడు జయరామ్...

 చూడు రిషి.... నీ స్నేహితుల మాటలన్నీ.... ఆకాశంలోని మబ్బుల లాంటివి.... ఒక్క గాలి దాటికి చెదిరి పోతాయి...

అంగవైకల్యం అనేది .. శరీరానికి మాత్రమే... మన బుద్ధికి,తెలివితేటలకు కాదు... ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లితే... నీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు... ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు... ఎట్టిపరిస్థితిలోనూ ని మనోధైర్యాన్ని కోల్పోకు.. చక్కగా చదువుకొని గొప్ప డాక్టర్  అయ్యి నీవు ఏంటో నిరూపించుకో... మీ విజయానికి గుర్తుగా మీ అమ్మ నాన్నలని నీకు పరిచయం చేస్తా.. అని రిషి కి మాటిచ్చాడు జయరాం..😇

                  ******

 రిషి ఆత్మవిశ్వాసంతో చదవడం మొదలు పెట్టాడు..

ఏనాడు.. ఎటువంటి పరిస్థితుల్లో రిషి  తన నమ్మకాన్ని కోల్పోలేదు...



 ఎన్ని అవమానాలు ఆటుపోట్లు ఎదురైనా వాటిని నవ్వుతూ స్వీకరించేవాడు.. తన తోటివారికీ.. ఆదర్శం గా తయారయ్యాడు... రిషి ఆత్మవిశ్వాసాన్ని చూసి జయరామ్ గర్వపడే వాడు.. రిషి తన చదువు పూర్తి చేసాడు.. తన కి గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ గా ఉద్యోగం రావడంతో.. ఈ శుభవార్త తన తాతయ్య తో పంచుకోవాలని ఇల్లంతా వెతికాడు... జయరాం కనపడకపోయేసరికి... పక్కనే ఉన్న పార్క్ కి వెళ్ళాడు...

 ప్రశాంతంగా పార్కు లో కూర్చున్న జయరాం కి ఏడుస్తున్న....ఒక పిల్లవాడు కనిపించాడు.

ఏమైంది....? బాబు అని ఆ పిల్లవాడిని అడిగాడు..

అప్పుడు ఆ పిల్లవాడు...

 తాతయ్య....

నేను, మా అమ్మ ఈ పక్కనే ఉన్న బస్తీలో ఉంటాము..

అమ్మ రోజు కూలి పని చేసి నన్ను పోషించేది.. ఒక వారం రోజుల నుండి...మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న వాటితో కాలం గడిపాము.. నిన్నటి నుంచి తినడానికి ఏమీ లేదు... అందుకే నిన్న.. జెండాలను అమ్మి....వచ్చిన డబ్బుతో అమ్మకు కావలసినవి తీసుకెళ్లా.. ఈరోజు కూడా అలాగే చేద్దామని చూస్తే అన్ని జెండాలు రోడ్లపై, చెత్తకుప్పల్లో దొరికాయి.. వాటిని శుభ్రం చేసి, కొత్తవాటిలా చేసి అమ్ముతుంటే ఒక్కరు కూడా కొనలేదు.. నిన్న పది రూపాయలకు అమ్మిన తీసుకున్నారు... కానీ ఈ రోజు కనీసం రెండు రూపాయలకు కూడా ఎవరు కొనలేదు... అంటూ ఏడవటం  మొదలుపెట్టాడు....

అప్పుడు జయరామ్...

నిన్న అంటే

స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి పది రూపాయలు అయినా 20 రూపాయలు అయినా అందరూ కొంటారు... ఎందుకంటే...

మన దేశంలో చాలామందికి...

 గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం...

ఈ రెండు రోజుల్లోనే దేశభక్తి ఎక్కువ అవుతుంది.... అందుకే జెండాలు విరివిగా  కొంటారు... మరుసటి రోజు ఈ విధంగా  నేలపై పడేస్తారు...🙄

నీకు చెప్పినా అర్థం కాని వయసు... అంటూ..

తన జేబులోంచి కొన్ని డబ్బులు తీసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టి... మీకు ఏ సహాయం కావాలన్నా ఇక్కడ పక్కనే ఉన్న మా ఇంటికి రా అంటూ చూపించాడు...

 ఇదంతా గమనిస్తున్న రిషి..

తాతయ్య....!

 అబ్బాయి వాళ్ళ అమ్మకి నేను ఉచితంగా వైద్యం అందిస్తాను.. ఎందుకంటే నీ మనవడు డాక్టర్ అయిపోయాడు...  అని నవ్వుతూ కౌగిలించుకున్నాడు.

 జయరాం....మాత్రం మౌనంగా ఆ చెత్త కుండి వైపు చూస్తూ నిలబడి పోయాడు.... ఇంత మంచి శుభవార్త చెబుతుంటే... మీరు అలా.... మౌనంగా చెత్తకుండి వైపు చూస్తున్నారు.. ఏంటి తాతయ్య....!

అని ప్రశ్నించాడు..????

 దానికి జయరాం.........!!!!

అందరూ ఉండి ఒంటరివాన్ని  అయినా నాకు....

ఎవరూ లేక ఒంటరిగా ఉన్న నువ్వు....

ఇక్కడే దొరికావు.... 😔

అని సమాధానమిచ్చాడు......

 జయరామ్ మాటలకు ఒక్కసారిగా.... రిషి కుప్పకూలిపోయాడు.....

అతని మనసు ఒక్కసారిగా చెమ్మగిల్లి పోయింది...😣

కన్నవారే వద్దనుకున్న నన్ను... ప్రేమగా పెంచి... అనుక్షణం నాలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని.... నింపిన మీకు జీవితాంతం

రుణపడిపోతాను.....తాతయ్య..... అంటూ జయరాం ని గట్టిగా పట్టుకొని ఏడ్చాడు...

చూడు రిషి మనం ఒకరికిఒకరం.... దేవుడిచ్చిన వరం.... 😊

నీవు  మంచి పనులు చేస్తూ.... చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి... సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి... అని చెప్పాడు.😇

 జయరాం... రిషి లు ఆనందంగా జీవనం గడుపుతున్నారు...

రిషి తనలాంటి అంగవైకల్యం ఉన్న వారికి ఆసరాగా నిలబడ్డాడు.. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు... 🤗

 సాయంత్రం వాకింగ్ కి వెళ్ళిన రిషి కి..

ఒక ఆమె ములుగుతూ బెంచి మీద పడుకొని కనిపించింది..

ఆమె దగ్గరికి వెళ్లి చూశాడు.. ఆమె జ్వరంతో బాధ పడుతుంది..

తనను లేపి వివరాలు అడిగాడు...

బాబు నా పేరు లక్ష్మి.... కొంతకాలంగా ఈ పక్క ఊర్లో ఉంటున్నాం...

నా భర్త చనిపోయిన అప్పటినుండి నా కొడుకు కోడలితో కలిసి ఉంటున్న...

ఇంత కాలం కూరగాయలు...అమ్మి జీవించాను... ఇప్పుడు అనారోగ్యం కారణంగా... ఏ పని చేయటం లేదని... నా కోడలు కొడుకు ఇంట్లో నుంచి గెంటి వేశారు... 😔

దాంతో నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉంటున్న...... అని చెబుతూ ఏడవడం మొదలు పెట్టింది...

మీ అబ్బాయి వివరాలు చెప్పండమ్మా......

అతని పని చెబుతా అని అంటున్నా...రిషి మాటలు పూర్తికాకుండానే....

వద్దు బాబు.. 🥺 ఇది నాకు జరగాల్సిందే.... ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను... 😐అంటూ ఏడ్చింది..

ఏమైందమ్మా...? ప్రశ్నించాడు రిషి...

పాతిక సంవత్సరాల క్రితం... నా కొడుకు అంగవైకల్యం కారణంగా... నా భర్త మాటకు కట్టుబడి...

ఇక్కడ ఈ చెత్తకుండీ లోనే వదిలేసి వెళ్ళను... అప్పుడు చేసిన పనికి ఇప్పటికీ పశ్చాత్తాప పడుతూనే ఉన్నా... 😐 కనీసం ఇలా అయినా శిక్ష అనుభవిస్తా.... అంటూ తన కన్నీళ్లను ఆపుకుంది...

అప్పుడు రిషి.....

ఆ బాబుని నేనే అమ్మ..... ఆవిడ కన్నీళ్లను తుడుస్తూ అన్నాడు...

ఆ మాటకి ఆశ్చర్యపోయిన లక్ష్మి.....

నిజమా అన్నట్లు.... ఆనందంతో...బాధ పశ్చాత్తాపంతో చూసింది... 🥺

జ్వరంతో ఉన్న తన తల్లిని దగ్గరికి తీసుకొని... పదమ్మ.... మన ఇంటికి వెళదాం అని అన్నాడు రిషి...

వద్దు బాబు..... చిన్నప్పుడే నిన్ను దూరం చేసుకున్న నాకు.. నీతో వచ్చే అర్హత లేదు....

ఒక తల్లిగా నీకు చేయవలసినవి చేయకుండా.... అనాధ లాగా...మార్చిన నా లాంటి దాన్ని అమ్మ అనడం వలన నీకు పాపం తగులుతుంది.. 😔 నాకు శిక్ష పడాలి... అంటూ ఏడవడం మొదలు పెట్టింది..

 చూడమ్మా.....!

మీరు నాకు ఈ అద్భుతమైన జన్మనిచ్చారు....

మీరు ఇచ్చిన....ఈ జీవితం అన్నిటికంటే గొప్ప వరం నాకు..

మీరంటు...లేకపోతే నాకు ఈ జన్మనే లేదు... 

పద... అమ్మ...

మీకు తాతయ్య ను పరిచయం చేస్తాను...🤗 అంటూ తన తల్లిని తీసుకెళ్లాడు.... రిషి 😇

--------------------------------

నవ్యవాణి కంచర్ల,

ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,

ప్రభుత్వ డిగ్రీ&పిజి కళాశాల,సిద్దిపేట.