రాజేష్ , రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు. రాజేష్ ధనవంతుడు  , బలవంతుడు , క్రూరత్వం కలిగిన వ్యక్తి . రమేష్ బీదవాడు , మంచి తెలివిమంతుడు , మంచితనం కలిగిన వ్యక్తి .

     కళాశాలలో ఎటువంటి క్రీడలు నిర్వహించిన రమేష్ , రాజేష్ ఇద్దరు ముందు ఉండేవారు . కానీ రాజేష్ , రమేష్ ని ఎప్పుడు ఎగతాళి చేస్తుండేవాడు .  ఈ క్రీడల్లో రాజేష్ విజయం సాధించే వాడు . రమేష్ ఒడిపోయేవాడు . అప్పుడు రాజేష్ , రమేష్ ని ఎగతాళిగా మాట్లాడేవాడు . అప్పుడు రమేష్  ఇప్పుడు నేను  ఓడిపోయి ఉండవచ్చు , కానీ మళ్ళీ పోరాడి గెలువగలను అనే నమ్మకం నాలో ఉంది . ఇప్పుడు  గెలిచిన నీవు తిరిగి గేలువగలను అనే నమ్మకం నీలో ఉందా!”అని అంటాడు .

      వెంటనే రాజేష్ కి భయం వేస్తుంది . ‘నేను మళ్ళీ గెలువలేనా? అని,కొన్ని రోజులు గడిచాయి . రమేష్ తండ్రి చనిపోయాడు ,దాంతో రాజేష్ , రమేష్ ని నీకు చదువు ఎందుకు?చదవటం మాని పని చేసుకో నాతో నీవు పోటీపడి ఎప్పటికీ గెలువలేవు . నీవు బీదవాడివి నీకు చదువు ఎందుకు ...అని

       అనగానే రమేష్ ఏ మాత్రం  సంకోచించకుండా " గెలుపుకి  తొలిమెట్టు ఓటమి" . ఒక్కసారి  ఓడినంత మాత్రాన జీవితాంతం ఓడిపోతామని కాదు అని చెప్తాడు . రమేష్ కి  ఒక కోరిక ‘ఇలాంటి వాళ్ళ నోర్లు మూపించాలంటే తను గొప్ప స్థానంలో ఉండాలని’.

       కొన్ని రోజులకు రమేష్ పెళ్లి కుదిరింది అతడి భార్య కూడా చాలా తెలివిమంతురాలు , మంచి ఇల్లాలు , గొప్పమనసు ఉన్న వ్యక్తి . కానీ అంతలోనే రమేష్ కి అనుకోని ప్రమాదం వల్ల రెండు కాళ్ళని కోల్పోతాడు.అతను అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.  రమేష్ అతని లక్ష్యాన్ని తన భార్య ద్వారా తీర్చుకోవాలని అనుకుంటాడు .  దానికి ఆమె ఒప్పుకుంటుంది . ఆమెని పై చదువుల కోసం పంపిస్తాడు. ఇన్నాలుగా దాచుకున్న డబ్బును భార్య చదువుల కోసం ఖర్చు చేస్తాడు.దానితో కొన్నాళ్ళకి రమేష్ భార్య గొప్ప కంపెనీ స్థాపించి చివరికి విజయం  సాధించి,తన భర్త లక్ష్యాన్ని నెరవేరుస్తుంది.

        వీళ్ళకి ఒక కూతురు జన్మిస్తుంది .తనను ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా పెంచుతారు. ఈ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది పెళ్లి కుదురుతుంది. పెళ్లి పత్రికలు ఇవ్వడానికి రమేష్ భార్య తనని తీసుకొని రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో రాజేష్ ఇంట్లో ఉండడు అతని భార్య ఉంటుంది.తను వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే......! రమేష్ భార్య, రాజేష్ భార్య వీళ్ళు కూడా స్నేహితులు . రమేష్, రాజేష్ కి మధ్య జరిగిన సంఘటనలు వీళ్ళ మధ్యలో జరిగాయి.తను వీళ్ళని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది.

        కొద్దిసేపటికి రాజేష్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. ఎవరు వీళ్ళు అని అతని భార్యను అడుగుతాడు.వెంటనే రమేష్ ‘ఏ రాజేష్ నన్ను ..నువ్వు గుర్తు పట్టలేదా....నేను రమేష్ ని...నీ చిన్ననాటి స్నేహితుడిని అని అంటాడు. అప్పుడు రాజేష్ ఆశ్చర్యపోతాడు.ఎందుకంటే! రమేష్ యొక్క గొప్పతనం గురించి , తన భార్య గురించి రాజేష్ న్యూస్ పేపర్ లో చూస్తాడు, అప్పుడు నిజం కాకపోవచ్చు ఇంతగా ఎదగటం వాడివల్ల కానేకాదు అనుకుంటాడు. కానీ..... ఇపుడు చూసి ఆశ్చర్యపోతాడు.

         అంతలోనే రాజేష్ కి ఫోన్ కాల్ వస్తుంది . కంపనీ కి కోట్లల్లో నష్టం వచ్చిందని , ఆ విషయం విన్న రాజేష్ కుప్పకూలిపోయాడు . అప్పుడు రమేష్ ఏ మాత్రం ఆలోచిచకుండా రాజేష్ కి సహాయం చేసి రాజేష్  స్థానాన్ని రాజేష్ కి కల్పిస్తాడు . అప్పుడు రాజేష్ బాధపడుతూ రమేష్ తో ఇలా అంటాడు....నేను , నిన్ను ఎన్నిసార్లు అవమానపరిచిన  అవమానాలను ఎదురుకొని గొప్ప స్థానంలో నిలిచావు . కానీ నాకు తట్టుకునే శక్తి గానీ ,ధైర్యం కానీ లేవు . ఒక సారి నీవు అన్న మాటల నీకు గుర్తున్నాయా? అని రాజేష్ ,రమేష్ ని అడుగుతాడు .

kv raghavacharya smaraka sahithya peetam
ఏంటి? అని రమేష్ అంటాడు...

  " గెలవాలంటే ధనవంతుడు కానవసరం లేదు...గెలవాలి అన్న తపన తనలో ఉంటే గెలవగలడు"

   "గెలుపు , గెలుపుతో మొదలు కాదు ,ఓటమీ , గెలుపు లు సహజం"

   "గెలువడనికి కావలిసింది డబ్బు కాదు గెలుస్తానని నమ్మకం , ధైర్యం"

" గెలుపు కి తొలి మెట్టు ఓటమీ" అని చెప్పావు..

  గెలువటం గొప్ప కాదు...., ఓడిన వ్యక్తి భుజం పై చేయి వేసి గెలువగలవు అని చెప్పడం గొప్ప..

   గెలుపుతో సంతోషం వస్తుందేమో కానీ... ఓటమితో అనుభవం వస్తుంది... దీనికి నేనే  ఒక మంచి ఉదాహరణ నిన్ను ఎప్పుడు అహంకారంతో గెలుపు నా సొంతం అన్నట్టుగా మాట్లాడేవాన్ని . కానీ ఒక్కసారిగా ఓడిపోయే సమయం వచ్చేసరికి నాకు ధైర్యం సరిపోలేదు..,గెలుస్తానని నమ్మకం కూడా పోయింది.

     అదే నీవు ఎన్ని సార్లు ఓడినా గెలువగలను అనే నమ్మకం నీలో ఉండేది . కానీ నాకు మాత్రం....నేను మళ్ళీ ఈ స్థానానికి రాగలను అనే నమ్మకం కోల్పోయాను ..నీవు పాత కక్షలు ఏవి నీ మనస్సులో పెట్టుకోకుండా కావలసిన సమయంలో సహాయం అందించావు, నా భుజం తట్టావు     

నీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను అని చెప్తాడు..


   " మనిషికి ఉండవలసింది అహంకారం , డబ్బు కాదు..., సహాయం చేసే గొప్పతనం , మంచితనం,గొప్ప మనస్సు" ఉండాలి..

 

    " ధనిక , పేద అనేవి మనం పెట్టుకున్న పేర్లు , డబ్బు ఉన్నవాడు ధనికుడు , లేని వాడు పేదవాడు అని కాదు ఓర్పు , సహనం ,ఆత్మగౌరవం , సంస్కారం , ప్రేమ ,ఆపదలో ఆదుకునేవాడు "  ఇవ్వన్ని ఉన్నవాడే నిజమైన ధనికుడు

         ఇవి ఉంటే మనిషి ఎప్పటికీ ఓడిపోలేడు.....

నీతి:"యుద్ధం చేసేవెళ శబ్ధం చెయ్యకు....నీ విజయమే  శబ్ధమై వినిపిస్తుంది"

 -రాజ్యలక్ష్మి,ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,                                                 
ప్రభుత్వ డిగ్రీ&పిజి కళాశాల(స్వయంప్రతిపత్తి),సిద్దిపేట.