అమ్మ ప్రేమ మధురమైనది..
అమ్మ చూపు చల్లనైనది.....
అమ్మమాట తీయనైనది....
అమ్మ మనసు సున్నితమైనది..
అమ్మ లేని జన్మ శూన్యం అయినది....
అమ్మ లేని లోటు పువ్వులు పూయని మొక్క లాంటిది....
కాయలు కాయని చెట్టు లాంటిది....
ఆకులు లేని కొమ్మ లాంటిది ...
జంతువులు లేని అడవి లాంటిది .....
పక్షులు లేని వనం లాంటిది ....
సూర్యుడు లేని భూమి లాంటిది .....
నక్షత్రాలు లేని ఆకాశం లాంటిది...
చంద్రుడు లేని పున్నమి లాంటిది....
విద్యార్థులు లేని పాఠశాల లాంటిది ....
ఇంకు లేని పెన్ను లాంటిది ....
అక్షరాలు లేని పుస్తకం లాంటిది.....
ఆత్మలేని శరీరం లాంటిది....
అమ్మ ప్రేమ చెట్టు లాంటిది,అన్ని ఇస్తుంది ....
అమ్మ ప్రేమ తేనె లాంటిది ,తీపిని ఇస్తుంది ...
అమ్మ ప్రేమ పాల లాంటిది ,స్వచ్ఛతను ఇస్తుంది...
అమ్మ కోపంలో ప్రేమ అలాగే దాగి ఉంటుంది....
*****
అమ్మ నడక హంస నడక....
అమ్మ పలుకు చిలుక పలుకు...
అమ్మ కన్నులు కలువ పూలు...
అమ్మ మొఖము చందమామ...
*****
అమ్మ మనసు అందం.....
అమ్మ ముఖం అందం......
అమ్మ కురులు అందం.....
అమ్మ కనుల అందం......
అమ్మ చూపందం...........
అమ్మ నవ్వందం.........
అమ్మతో జీవితమే ఆనందం....
-------------------------
602520014528 ,
ఎం. ఏ తెలుగు ద్వితీయ సంవత్సరం ,
ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల సిద్దిపేట
0 Comments