కవిత్వంలో నూతనత్వాన్ని, ప్రామాణికమైన రచనల్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ వాసా ప్రభావతి సంస్మరణర్థం కవితల పోటీ నిర్వహించాలని పాలపిట్ట-వాసా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్ణయించాయి. సామాజిక జీవితానికి సంబంధించిన అంశాలు ఏవైనా కవితా వస్తువుగా స్వీకరించవచ్చు. మహిళల సంవేదనల మీద వచ్చే కవితలకు ప్రాధాన్యం ఉంటుంది.
మొదటి బహుమతిః 3000
రెండో బహుమతిః 2000
మూడో బహుమతిః 1000
ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు ( ఒక్కొక్క కవితకు 500 రూపాయలు)
ఇదివరలో ఎక్కడా ప్రచురితం, ప్రసారం కాని, సోషల్ మీడియాలో పోస్టు చేయని కవితలు మాత్రమే పంపించాలి.
కవితలు పంపడానికి చివరి తేదీః 30 మార్చి 2022
కవితలు పంపించాల్సిన చిరునామాః ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం-2, బ్లాక్-6, ఎంఐజి-2, ఏపిహెచ్బి, బాగ్ లింగంపల్లి,
హైదరాబాద్, 500 044, ఫోనుః 9490099327
0 Comments