అమ్మ అనే కమ్మని మాటలోనే ఉంది అమృతధార ప్రేమ పంచి పెంచి లాలించి బుజ్జగించి అభిమానాన్ని గోరుముద్దగా పెట్టే అమ్మకు ఆ బ్రహ్మ కూడా దాసోహమేగా..........

స్వార్ధం అంటే తెలియక గుప్పెడు గుండెలో ఆకాశమంత ప్రేమను మాత్రమే పంచేది అమ్మే కదా........

అమ్మ అని పిలిస్తే ఆప్యాయతని అంతా ఆలంబనగా చేసి మనకి కొండంత అండగా తన గుండె పరిచి  నడిపించి కాపాడేది ఈ అమ్మ జన్మే కదా....

 మనకి కష్టమొస్తే తన కన్నీరు నీరు వర్షిస్తుంది ఇది దేవునికైనా అసాధ్యమేగా....

 మన కేరింత చూసి తన మనసు పులకరించి విర విరబూస్తున్నది ఇది అమ్మ ప్రేమ లోని స్వచ్ఛతే కదా....

 గుండె మండేలా మాట్లాడి నా గునపాలు దించిన కిక్కురుమనక  అనురాగం పంచేది అమ్మేగా....

కంట నీరు పెట్టించినా ఎంత వేదన మిగిల్చిన మన కష్టంలో వేలు పట్టి వెన్నుతట్టి   ఓదార్చేది అమ్మ అనురాగమే కదా......

 


పాషాణ గుండెకి మమతని ధార బోసేది అమ్మే కదా....

మన విజయానికి మనల్ని మించి సంబరపడి పండగ చేసుకునేది అమ్మ ప్రేమే కదా.....

  చిలుక పలుకులను పలికించి

 పలకనునా చేతికి అందించి

 అక్షరాలను నా చేత దిద్దించి

 నాకు బంగారు భవిష్యత్తును ప్రసాదించిన ఆ కమ్మని పలుకే అమ్మ ...... అమ్మ ప్రేమ వెలకట్టలేనిది...

 నా మొఖం చూడకముందే

 నా గొంతు వినక ముందే

 నా గుణం తెలియకముందే

 నన్ను ప్రేమించిన గొప్ప హృదయం అమ్మ.....

 ఆకలి వేస్తే అమ్మ..

 అలసిపోతే అమ్మ భయం వేస్తే అమ్మ బాధ కలిగితే అమ్మ ఎలా ప్రతి చోట అమ్మ ప్రతి పనిలోనూ అమ్మ...... " కనిపించని దైవం కన్నా కనిపించే అమ్మ మిన్న"""🙏

 అమ్మ ఒక వేదం

 అమ్మ ఒక భక్తి భావం

 అమ్మ ఒక ప్రేమ రూపం

 అమ్మ ఒక భావన

అమ్మ ఒక పుస్తకం

 అమ్మ ఒక కలం

 అమ్మ ఒక కవిత 

 అమ్మ ఒక జ్ఞానం

 అమ్మ ఒక గుడిలో దీపం

 అమ్మ ఒక చల్లని చిరుగాలి

 అమ్మ ఒక అన్నపూర్ణ దేవి

 అమ్మ ఒక శ్వాస

 అమ్మ ఒక మధుర గేయం

 అమ్మ ఒక మురళీగానం

 అమ్మ ఒక జోల పాట

 అమ్మ ఒక దీవెన

 అమ్మ ఒక దేవత అమ్మ ఒక స్వచ్ఛత అమ్మ ఒక వెలుగు అమ్మ ఒక భద్రత అమ్మ ఒక ప్రవచనం ఒక నమ్మకం.... అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు... అమ్మ ప్రేమానురాగాలు పంచే అన్నపూర్ణ దేవి.... అమ్మను మించిన గొప్ప దైవం సృష్టిలో ఏదీ లేదు.... అమ్మకి భూదేవికి ఉన్నంత ఓర్పు కలది అమ్మ ప్రేమ..... 


పి.  మీన

602520014513

ఎం. ఏ తెలుగు ద్వితీయ సంవత్సరం 

ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల సిద్దిపేట