కవిత్వం విలువ తెలుసుకున్నాను 
కలం కదిపి రాయాలనుకున్నాను 
ఒక్కసారిగా నా కళ్ళలో చదివిన కవితలు మెరిసినవి
కవుల ఆలోచనలు వెలిగినవి 
అవి విలువల పట్టికను అద్దం పట్టిచూపుతున్నవి 
తప్పు ఒప్పులను గురించి తీరిక లేకుండా తెలుపుతున్నవి 
మనసులో ఉత్సాహం ప్రోత్సహం నింపుతున్నవి 
పుట్టిన పల్లె - భాగ్యనగరం 
బంధాల భాగ్యం -అమరుల త్యాగం 
బతుకు బాట - ఆకలి వేట అమ్మ ప్రేమ 
అన్ని వర్ణిస్తున్నది స్మృతులను స్మరింపజేస్తున్నవి 
ప్రతిష్టలను పరిమళింపజేస్తున్నవి 
స్థితిగతులను వివరిస్తున్నవి 
దిద్దుబాటుగా సర్దిచెప్పుతున్నవి 
నా మనసులో కవిని 
నాలుగు తలల బ్రహ్మతో పోల్చుకున్నాను 
వయసులో కవిని 
వేల సంవత్సరాల కలంతో పోల్చుకున్నాను 
నా కిష్టమైన కవిని తలచుకున్నాను 
నా ఆలోచనలను అద్దుకున్నాను 
కలం కదిపి కవిత్వం రాసాను      
- వై .  ధనలక్ష్మి 
  ఎం.ఏ  ద్వితీయ  సంవత్సరం